Pooja Hegde : ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒకరు. పూజా హెగ్డే ఇటీవల బన్నీతో నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంతో బాగా పాపులర్ అయ్యింది . ఈ సినిమా సంచలన విజయం సాధించడం, ఇందులో అల్లు అర్జున్.. పూజా కాళ్లని హైలైట్ చేయడం.. ఈ హాట్ హీరోయిన్‌కి క్రేజ్‌ని తీసుకొచ్చింది. పూజా నటించిన రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు విడుదలకి సిద్ధంగా ఉన్నాయి.
పూజా హెగ్డే ప్రస్తుతం మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. మరోవైపు తమిళంలో విజయ్‌తో `బీస్ట్` చిత్రంలో నటిస్తోంది. మరో తమిళ సినిమా కూడా చేస్తుందని టాక్. ఇంక హిందీలోనూ పలు సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడి బిజీ షెడ్యూల్ గురించి హరీష్ శంకర్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈవెంట్ గురించి మాట్లాడాడు. మన అందరికీ లాక్ డౌన్ వచ్చి ఖాళీగా ఉన్నాం. కానీ పూజా హెగ్డే మాత్రం ఒక్క రోజు కూడా ఖాళీగా లేదు.
ఎవరైనా దర్శకులు హీరోయిన్ల డేట్ల కోసం ఎదరుచూస్తుంటారు. కానీ ఇప్పుడు పూజా హెగ్డే ఫోన్ కాల్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెతో మాట్లాడాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్‌కి వచ్చే సమయంలో ఏదైనా షూటింగ్ చేస్తుందేమో అనుకున్నాను. పవన్‌తో కూడా నటిస్తుంది.. అంటూ తను తెరకెక్కిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో పూజా హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలియజేశాడు హరీష్ శంకర్. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…