గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Pooja Hegde : పూజాతో మాట్లాడాలి అంటే ప‌ర్మిష‌న్ తీసుకోవాలి: హ‌రీష్ శంక‌ర్

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒక‌రు. పూజా హెగ్డే ఇటీవ‌ల బన్నీతో నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యింది . ఈ సినిమా సంచలన విజయం సాధించడం, ఇందులో…

Pooja Hegde : పూజాతో మాట్లాడాలి అంటే ప‌ర్మిష‌న్ తీసుకోవాలి: హ‌రీష్ శంక‌ర్

Pooja Hegde : ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో పూజా హెగ్డే ఒక‌రు. పూజా హెగ్డే ఇటీవ‌ల బన్నీతో నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంతో బాగా పాపులర్‌ అయ్యింది . ఈ సినిమా సంచలన విజయం సాధించడం, ఇందులో అల్లు అర్జున్‌.. పూజా కాళ్లని హైలైట్‌ చేయడం.. ఈ హాట్‌ హీరోయిన్‌కి క్రేజ్‌ని తీసుకొచ్చింది. పూజా న‌టించిన రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాలు విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్నాయి.

need to take permission from Pooja Hegde to talk to her

పూజా హెగ్డే ప్ర‌స్తుతం మహేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. మరోవైపు తమిళంలో విజయ్‌తో `బీస్ట్` చిత్రంలో నటిస్తోంది. మరో తమిళ సినిమా కూడా చేస్తుందని టాక్‌. ఇంక హిందీలోనూ ప‌లు సినిమాలు చేస్తోంది. ఈ అమ్మ‌డి బిజీ షెడ్యూల్ గురించి హ‌రీష్ శంక‌ర్.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఈవెంట్ గురించి మాట్లాడాడు. మన అందరికీ లాక్‌ డౌన్‌ వచ్చి ఖాళీగా ఉన్నాం. కానీ పూజా హెగ్డే మాత్రం ఒక్క రోజు కూడా ఖాళీగా లేదు.

ఎవరైనా దర్శకులు హీరోయిన్ల డేట్ల కోసం ఎదరుచూస్తుంటారు. కానీ ఇప్పుడు పూజా హెగ్డే ఫోన్ కాల్ కోసం కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆమెతో మాట్లాడాలంటే కూడా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈవెంట్‌కి వ‌చ్చే స‌మ‌యంలో ఏదైనా షూటింగ్ చేస్తుందేమో అనుకున్నాను. ప‌వ‌న్‌తో కూడా న‌టిస్తుంది.. అంటూ త‌ను తెరకెక్కిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ చిత్రంలో పూజా హీరోయిన్‌గా ఎంపికైన‌ట్టు తెలియ‌జేశాడు హ‌రీష్ శంకర్‌. ఇక ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి