Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన అనంతరం సమంత ఆధ్యాత్మిక టూర్లు వేస్తూనే మరోవైపు పలు సినిమాలకు సైన్ చేసింది. ఇక ప్రస్తుతం ఆమె దుబాయ్ పర్యటనలో ఉంది. అయితే త్వరలో ఆమె బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు తాప్సీతో ఆమె చర్చలు జరుపుతోందట.
బాలీవుడ్‌లో ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలతో తాప్సీకి మంచి పేరు వచ్చింది. ఇక ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా అటు నార్త్‌లోనూ సమంత నటిగా మంచి గుర్తింపు పొందింది. దీంతో ఆమెతో ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాను తీయాలని తాప్సీ భావిస్తోందట. తాప్సీకి అక్కడ ఔట్ సైడర్ ఫిలిమ్స్ అనే ప్రొడక్షన్ హౌజ్ ఉంది. దీంతో తమ నిర్మాణ సంస్థ ద్వారా సమంతను బాలీవుడ్‌కు పరిచయం చేయాలని తాప్సీ భావిస్తోందట. ఈ క్రమంలోనే త్వరలో సమంత బాలీవుడ్ ఎంట్రీ ఖాయమని, ఆమె తాప్సీతో కలిసి బాలీవుడ్‌ను షేక్ చేస్తుందని అంటున్నారు.
ఇక తెలుగులోనూ సమంత పలు సినిమాలకు సైన్ చేసింది. ఆమె నటించిన శాకుంతలం అనే మూవీతోపాటు కాతు వాకుల రెండు కాదల్ అనే మూవీ సైతం త్వరలో విడుదల కానున్నాయి. మరి బాలీవుడ్‌లో సమంతకు అదృష్టం కలసి వస్తుందో, లేదో.. చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…