Janhvi Kapoor : ఆధ్యాత్మిక టూర్‌లో జాన్వీ క‌పూర్‌.. తోడుగా సారా అలీ ఖాన్‌..!

Janhvi Kapoor : బాలీవుడ్ సెల‌బ్రిటీల కుమార్తెలు, కొడుకులు.. ఎప్పుడూ వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటారు. వారు సోష‌ల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా స‌రే.. ట్రోల్ చేసేందుకు నెటిజ‌న్లు సిద్ధంగా ఉంటారు. అయితే తాజాగా సారా అలీ ఖాన్‌, జాన్వీ క‌పూర్‌లు వేసిన ట్రిప్ తాలూకు ఫొటోల‌ను త‌మ సోష‌ల్ ఖాతాల్లో షేర్ చేయ‌గా.. నెటిజ‌న్ల నుంచి మిశ్ర‌మ రీతిలో స్పంద‌న ల‌భిస్తోంది.

సారా అలీ ఖాన్‌, జాన్వీ క‌పూర్ ఇద్ద‌రూ ఎప్పుడూ గ్లామ‌ర‌స్ ఫొటోషూట్‌లు చేస్తూ.. విహారాలు చేస్తూ.. హాట్ ఫొటోల‌ను త‌మ సోష‌ల్ ఖాతాల్లో పెడుతుంటారు. దీంతో నెటిజ‌న్లు విమ‌ర్శిస్తుంటారు. అయితే ఈసారి వారు భిన్నంగా ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సంద‌ర్శించి దాని తాలూకు ఫొటోల‌ను పోస్ట్ చేశారు. దీంతో చాలా మంది నెటిజన్లు వారిని అభినందిస్తున్నారు.

వారిద్ద‌రూ కేదార్‌నాథ్‌ను ద‌ర్శించుకున్న అనంత‌రం అక్క‌డ దిగిన ఫొటోల‌ను పోస్ట్ చేశారు. వాటిల్లో వారు సాధార‌ణ దుస్తులు ధ‌రించి, మేక‌ప్ లేకుండా ఉన్నారు. దీంతో ఎప్పుడూ గ్లామ‌ర్‌గా క‌నిపించేవారు.. సాధార‌ణ లుక్‌లో క‌నిపించే స‌రికి.. నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. వారి ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ఆధ్యాత్మిక క్షేత్రాల‌ను సంద‌ర్శించినందుకు వారిని కొంద‌రు అభినందిస్తుంటే.. కొంద‌రు మాత్రం విమ‌ర్శిస్తున్నారు.

ఇక జాన్వీక‌పూర్, సారా అలీ ఖాన్ ఇద్ద‌రూ ఇటీవ‌ల ర‌ణ‌వీర్ సింగ్ క్విజ్ షో ది బిగ్ పిక్చ‌ర్‌ లో క‌నిపించి సంద‌డి చేశారు. సారా అలీ ఖాన్ అత్రంగీ రే మూవీలో న‌టించ‌గా.. అందులో అక్ష‌య్‌, ధనుష్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. త్వ‌ర‌లో ఈ మూవీ విడుద‌ల కానుంది. జాన్వీ క‌పూర్ ఇటీవ‌లే న‌టించిన రూహీ మూవీ విడుద‌ల కాగా.. త్వ‌ర‌లో గుడ్ ల‌క్ జెర్రీ, దోస్తానా 2 అనే మూవీల్లో క‌నిపించ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM