Samantha : కూతురి పెళ్లి కోసం డ‌బ్బులు కూడ‌బెట్ట‌న‌క్క‌ర్లేదు.. స‌మంత స్ట‌న్నింగ్ కామెంట్స్ వైర‌ల్..

October 27, 2021 3:37 PM

Samantha : విడాకుల త‌ర్వాత స‌మంత తెగ నీతి సూక్తులు భోదిస్తోంది. త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా వేదాలు వ‌ల్లిస్తోంది. కొద్ది రోజుల క్రితం మై మామ్ సెయిడ్ అంటూ ఆమె షేర్ చేసిన కోట్స్ అందరి దృష్టినీ ఆకర్షించాయి. సమాజంలో మనిషి ఎలా ఉండాలి.. ఒక మనిషి తన సొంత విషయాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అమ్మాయిలు సమాజంలో గౌరవం దక్కించుకునేందుకు అనుసరించాల్సిన పద్దతులు.. ఇలా ఎన్నో రకాలుగా సమంత ఇన్ స్టా స్టోరీల రూపంలో షేర్ చేస్తోంది.

Samantha stunning comments to parents over their daughters

తాజాగా అమ్మాయిల త‌ల్లిదండ్రుల‌కు స‌లహాలు, సూచ‌న‌లు ఇస్తూ ఓ పోస్ట్ పెట్టింది స‌మంత‌. మీ కూతురు పెళ్లి గురించి కంగారు పడనవసరం లేదు. ఆమెను సమర్థవంతంగా తీర్చిదిద్దండి. ఆమె పెళ్లి కోసం డబ్బులు కూడబెట్టే బదులుగా ఆమె చదువుకు ఆ డబ్బును ఖర్చు చేయండి. ఆమెను పెళ్లికి సిద్దం చేయడానికి బదులుగా ఆమెను ఆమె కోసం సిద్దంగా ఉండేలా చేయండి. ఆమెకు ప్రేమ.. ఆత్మ విశ్వాసం గురించి తెలియజేయండి.. అంటూ నీతులు బోధించింది.

Samantha stunning comments to parents over their daughters

స‌మంత సినిమాల విష‌యానికి వ‌స్తే.. ‘కాతువక్కుల రెందు కాదల్‌’, ‘శాకుంతలం’ చిత్రాలతోపాటు తాజాగా ఆమె మరో రెండు సరికొత్త ప్రాజక్ట్స్‌ని ఓకే చేసింది. మరోవైపు సామ్ మాజీ భ‌ర్త చైతూ ‘లవ్‌స్టోరీ’ విజయం అందుకున్న త‌ర్వాత ‘థ్యాంక్‌ యూ’, ‘బంగార్రాజు’ చిత్రీకరణలతో బిజీ అయ్యారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment