Samantha : బాబోయ్ సినిమాకు రూ.3 కోట్ల రెమ్యున‌రేష‌నా.. స‌మంత రేంజ్ పెరిగిపోయిందిగా..!

November 25, 2021 9:46 AM

Samantha : నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకున్న త‌ర్వాత స‌మంత త‌న దృష్టిని పూర్తిగా సినిమాల‌పైనే పెట్టిన‌ట్టు తెలుస్తోంది. విడాకుల ప్రకటన ఆనంతరం ఆ బాధ నుంచి బయట పడేందుకు ఆమె తీర్థ యాత్రలు, పర్యటనల‌తో బిజీగా మారింది. మ‌రోవైపు వ‌రుస సినిమాల‌కు సైన్ చేస్తోంది. ఇప్పటికే ఆమె శాకుంతలంలో నటించగా, తమిళంలో విజయ్‌ సేతుపతితో  ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ సినిమాలో నటిస్తోంది.

Samantha reportedly taking rs 3 crore per movie

డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోన్న 30వ చిత్రానికి ఆమె సంతకం చేసింది. దీనిపై ఇటీవల అధికారిక ప్రకటన కూడా వెలువడింది. సామ్‌ బాలీవుడ్‌ ఎంట్రీ కూడా ఇవ్వబోతోందంటూ కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు ప్రముఖ నటి తాప్సీ పన్ను నిర్మాణంలో సామ్‌ ఓ ప్రాజెక్ట్‌ చేయబోతుందని, దీనికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తొలిసారి పుష్ప కోసం ఐటెం గర్ల్ గా కూడా మార‌బోతోంది. నాలుగు నిమిషాల కోసం కోటిన్న‌ర రూపాయలు వ‌సూలు చేయ‌నుంద‌ట‌.

సమంత రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయలు తీసుకుంటుంద‌ని అంటున్నారు. ఒకేసారి స‌మంత అంత రెమ్యున‌రేష‌న్ పెంచేయ‌డంతో నిర్మాత‌లు ఖంగు తింటున్నారు. కొంద‌రు నిర్మాత‌లు అంత మొత్తం ఇచ్చి ఆమెతో సినిమాలు చేయ‌డానికి రెడీగా కూడా ఉన్నార‌ట‌. ఏదేమైనా స‌మంత సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయేలా ఉంద‌ని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment