Samantha : స‌మంత ఖాతాలో మ‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్.. హీరో ఎవ‌రో తెలిస్తే షాక‌వుతారు..!

Samantha : ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ స‌మంత‌. కెరీర్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ టాప్ రేంజ్‌కి వెళ్లింది. ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. ఇందులో రాజీ అనే ఎల్‌టీటీఈ రెబెల్‌ పాత్రలో అద్భుత నటనను కనబర్చి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సిరీస్‌ కూడా సూపర్‌ హిట్‌ కావడంతో సామ్‌ కు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలోనే మరో వెబ్‌సిరీస్‌కు పచ్చ జెండా ఊపింది.

Samantha

బాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో స్పై థ్రిల్లర్‌ యాక్షన్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో స‌మంత క‌నిపించ‌నుంది. మార్వెల్‌ సినిమాల రూపకర్తలు రూసో బ్రదర్స్‌ హాలీవుడ్ లో సిటాడెల్ పేరుతో ఓ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్రియాంక ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా ఈ సినిమాకు ఇండియన్‌ వెర్షన్‌ నే వెబ్ సిరీస్‌గా రాజ్‌ అండ్‌ డీకే రూపొందిస్తున్నారు. అయితే స‌మంత మ‌రో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి సైన్ చేసిన‌ట్టు తాజాగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ రాబోయే ప్రాజెక్ట్‌లో హీరోయిన్ గా నటించడానికి సమంత అంగీకరించినట్లు తెలుస్తోంది.

కుమార్ మంగత్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించాలని భావిస్తున్నారు. ఈ సినిమా న‌టీన‌టులు, ఇతర వివ‌రాల‌కి సంబంధించి త్వ‌ర‌లో ప్ర‌క‌ట‌న రానుంది. సమంత పేరు ఇటీవలి కాలంలో బాగా వినిపిస్తోంది. వైవాహిక జీవితానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టిన తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారింది. పుష్ప చిత్రంలో ఐట‌మ్‌ సాంగ్‌తో ఒక్కసారిగా సంచలనం సృష్టించిన ఈ చిన్నది అందరి దృష్టినీ తనవైపు తిప్పుకుంది. ముఖ్యంగా నార్త్‌ ఆడియన్స్‌ను బాగా అట్రాక్ట్‌ చేసింది. ఈ పాటతో మొదలైన సమంత సినిమాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే తెలుగులో యశోద, శాకుంతలమ్‌ సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్న సామ్‌ బీటౌన్‌లోనూ తన సత్తా చాటుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

ఓటీటీలోకి వరలక్ష్మీ శరత్ కుమార్ ‘ఎస్. సరస్వతి’.. ఎక్కడ చూడాలంటే?

న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ త‌మిళ‌నాడు వాసి అయిన‌ప్ప‌టికీ ప‌లు ఇత‌ర భాష‌ల్లోనూ చిత్రాలు చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. గ‌తంలో ఆమె…

Friday, 3 April 2026, 9:50 PM

‘రాజా సాబ్’ చేదు జ్ఞాపకం.. మాళవిక మోహనన్ ఎమోషనల్ పోస్ట్! మార్చి నెలలో ఆమెకు ఏమైంది?

మ‌ల‌యాళ ముద్దుగుమ్మ మాళ‌విక మోహ‌న‌న్‌కు టాలీవుడ్‌లో తొలి మూవీలోనే చేదు అనుభ‌వం ఎదురైంది.ఆమె న‌టించిన రాజాసాబ్ మూవీ అట్ట‌ర్ ఫ్లాప్‌గా…

Friday, 3 April 2026, 6:02 PM

రామాయణ టీజర్ వచ్చేసింది.. రాముడిగా రణబీర్ దివ్యత్వం! రావణుడిగా యశ్ అదిరిపోయే ఎంట్రీ..

దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా ర‌ణ‌బీర్ క‌పూర్ తొలి…

Thursday, 2 April 2026, 3:04 PM

చిరంజీవి ఇంటి పూజా మందిరంలో అద్భుతం.. హనుమాన్ విగ్రహంపై సూర్య కిరణాలు!

హ‌నుమాన్ జ‌యంతి సంద‌ర్భంగా త‌మ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్ర‌హంపై సూర్య కిర‌ణాలు ప‌డ‌డం త‌న…

Thursday, 2 April 2026, 11:37 AM

‘పెద్ది’ రిలీజ్ డేట్‌పై రామ్ చరణ్ క్లారిటీ.. ఏప్రిల్ 30న థియేటర్లలో మెగా మాస్ జాతర!

బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.…

Wednesday, 1 April 2026, 11:20 PM

అమరావతికి నేను వ్యతిరేకం కాదు.. అది దేశంలోనే పెద్ద స్కామ్! చంద్రబాబుపై జగన్ ఫైర్..

అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఉండ‌డంలో త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని, కానీ రాజ‌ధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్ప‌డుతోంద‌ని, దానికి తాము…

Wednesday, 1 April 2026, 9:09 PM

సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!

ప‌బ్లిక్‌లో ఉన్న‌ప్పుడు సెల‌బ్రిటీల‌తో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గంద‌ర‌గోళ…

Wednesday, 1 April 2026, 5:13 PM

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన…

Wednesday, 1 April 2026, 3:36 PM