Mahesh Babu : అడ‌వి అడ్వెంచ‌ర్‌ నేప‌థ్యంలో మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా..? బ‌డ్జెట్ రూ.800 కోట్లు..?

Mahesh Babu : ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన రాజమౌళి త్వ‌ర‌లో మ‌హేష్ బాబు హీరోగా ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా గురించిన‌ ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాను రాజమౌళి దాదాపుగా రూ.800 కోట్లతో భారీగా రూపొందించనున్నారట. ఈ సినిమా అడ్వెంచర్ డ్రామా అని, RRR, బాహుబలి కంటే పెద్దదిగా ఉండబోతోందని టాక్స్ వినిపించాయి. అయితే ఈ విష‌యాల‌పై ర‌చ‌యిత విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్పందించారు.

Mahesh Babu

మ‌హేష్ – రాజ‌మౌళి సినిమా రూ.800 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడుతుందనే పుకార్లలో నిజం ఉందా.. అని విజయేంద్ర ప్రసాద్‌ను అడగ‌గా, విజయేంద్ర ప్రసాద్ కాస్త వెట‌కారంగా న‌వ్వుతూ కొట్టి పారేశారు. కథ లేకుండా రూ.800కోట్ల బ‌డ్జెట్ ఎక్క‌డిది అని ప్ర‌శ్నించారు. ఈ ఏడాది చివరికల్లా రాజమౌళి కథను ఖరారు చేసి, ఈ క్యాలెండర్ ఇయర్‌లో సినిమాను అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. జంగిల్ అడ్వెంచర్ చిత్రంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మ‌హేష్ బాబుతో రాజమౌళి, కె విజయేంద్ర ప్రసాద్‌లు ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఇక ఈ సినిమాలో మహేష్ సరసన నటించే హీరోయిన్ విషయంలో ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మహేష్‌ సరసన హిందీ హీరోయిన్ ఆలియా భట్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి RRRలో సీత పాత్రలో నటించిన ఆలియా భట్ మరోసారి రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో హీరోయిన్‌గా నటించనుందని అంటున్నారు. ఆ మేరకు ఆలియా భట్‌తో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నార‌ట‌. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM