Samantha : ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి సమంత అంత తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటుందా..?

August 6, 2022 11:35 AM

Samantha : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది సమంత. పెళ్లి తర్వాత కూడా సాధారణ అమ్మాయిలా కాకుండా నిత్యం ట్రెండీ ఫ్యాషన్ దుస్తులను ధరిస్తూ.. వాటిని ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్‌లోనూ షేర్ చేస్తూ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా పంచుకుంటూ ఉంటోంది సమంత.

సమంత ప్రస్తుతం నేషనల్ లెవెల్‌లో స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో సమంతకు ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. అలాగే పుష్పలోని ఐటం సాంగ్‌ ఊ అంటావా మావా.. అనే పాట వరల్డ్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. అలా సమంత క్రేజ్ వరల్డ్ వైడ్‌గా పెరిగింది. దీంతోపాటు సమంత సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.

Samantha remuneration for opening one shopping mall
Samantha

ప్రస్తుతం అనేక సినిమాలతో బిజీగా ఉన్న సామ్ సమయం దొరికినప్పుడల్లా వస్త్ర దుకాణాల ప్రారంభోత్సవానికి వెళ్తుంటుంది. అయితే సమంత స్టార్ హీరోయిన్ కాబట్టి ఒక్కో షాప్ ఓపెనింగ్ కి ఎన్ని డబ్బులు తీసుకుంటుంది అనే ఆలోచన మనకు రాకమానదు. అయితే గ‌తంలో సమంత నల్గొండలోని మాంగళ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించింది. ఈ షాప్ ఓపెనింగ్ కి చాలా తక్కువ తీసుకుంటున్నట్టు తెలిపింది. సామ్ ఓ షాప్ ఓపెనింగ్ కి రూ.15 నుంచి రూ.20 లక్షలు మాత్రమే తీసుకుందట. నిజానికి స్టార్ హీరోయిన్స్ ఇలాంటి ఫంక్షన్స్ కి చాలా పెద్ద మొత్తం డిమాండ్ చేస్తారు కానీ సామ్ ఎందుకో తక్కువ తీసుకుందట.

ప్రస్తుతం సమంత హీరోయిన్ గా కంటే లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్స్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. యశోద, శాకుంతలంతోపాటు రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఖుషి, మరో హాలీవుడ్ మూవీ అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్ లో కూడా నటిస్తోంది సమంత.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment