తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లో ఉన్న స‌మంత‌.. సాక్ష్యం ఇదిగో..!

August 5, 2022 10:17 PM

నాగ‌చైత‌న్యతో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి స‌మంత ఒంట‌రి జీవితాన్నే అనుభ‌విస్తోంది. వాస్త‌వానికి ఆమెకు త‌ల్లిదండ్రులు ఉన్న‌ప్ప‌టికీ వారు చెన్నైలో స్థిర ప‌డ్డారు. అందువ‌ల్ల స‌మంత‌తో వారు క‌ల‌సి జీవించే అవ‌కాశం లేదు. అయితే కార‌ణాలు ఏమున్నా.. స‌మంత ప్ర‌స్తుతం ఒంట‌రి జీవితాన్నే గ‌డుపుతోంది. ఈ క్ర‌మంలోనే ఆమె తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లో కూడా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకు సాక్ష్యాన్ని కూడా కొంద‌రు చూపుతున్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఆమె చేతిలో ఉన్న పుస్త‌క‌మే.. ఆమె డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతుంద‌ని చెప్పేందుకు ఉదాహ‌ర‌ణ అని అంటున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే..

స‌మంత ఇటీవ‌లే ముంబై ఎయిర్‌పోర్టులో ద‌ర్శ‌న‌మిచ్చింది. ప‌లు బాలీవుడ్ ప్రాజెక్టుల్లోనూ అవ‌కాశాలు వ‌స్తున్నందున ఆమె ముంబైకే మారిపోయింది. అక్క‌డి నుంచి హైద‌రాబాద్‌కు త‌ర‌చూ వ‌స్తూ ఇక్క‌డ షూటింగ్స్ చేస్తోంది. అయితే ముంబై ఎయిర్ పోర్టు నుంచి బ‌య‌టకు వ‌స్తూ క‌నిపించిన స‌మంత చేతిలో ఓ పుస్త‌కం ప‌ట్టుకుని ద‌ర్శ‌న‌మిచ్చింది. దాని పేరు.. యూ కెన్ హీల్ యువ‌ర్ లైఫ్‌. దీన్ని ప్రముఖ రచయిత లూయిస్ హే ర‌చించారు. ఈ క్ర‌మంలోనే ఈ పుస్త‌కాన్ని స‌మంత చేతిలో చూడ‌డంతో ఆమె తీవ్ర‌మైన డిప్రెష‌న్‌లో ఉంద‌ని అంటున్నారు.

samantha reading a psychology book she might be in depression

ఇక ఆ బుక్‌లో మానసిక ప్రశాంతత‌ను సాధించడం, మనసును శరీరానికి అనుసంధానం చేయడం, భావోద్వేగాలపై అదుపు.. వంటి విషయాల గురించి ప్ర‌స్తావించారు. ఈ క్ర‌మంలోనే మానసిక సమస్యలతో బాధ‌ప‌డుతున్న వారికి ఈ బుక్ ఉపయోగ‌ప‌డుతుంది. అయితే స‌మంత చేతిలో ఈ పుస్త‌కాన్ని చూడ‌డంతో ఆమె డిప్రెష‌న్ లో ఉన్న‌ట్లు అర్థం చేసుకోవ‌చ్చు. నాగ‌చైత‌న్యతో విడాకులు తీసుకోవ‌డం వ‌ల్ల ఆమె లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఆమెపై రోజు రోజుకీ నెగెటివిటీ ఎక్కువైపోయింది. దీంతో ఒత్తిడిని త‌గ్గించుకునేందుకు ఆమె ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. క‌నుక‌నే ఆ పుస్త‌కం చ‌దువుతుంద‌ని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది అనే విష‌యం మాత్రం తెలియాల్సి ఉంది.

ఇక స‌మంత ప్ర‌స్తుతం బాలీవుడ్‌పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టింది. ముంబైలో ఓ ఖ‌రీదైన ఇంటిని ఈమె కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే ఈమె రెండు వ‌రుస బాలీవుడ్ చిత్రాల‌కు ఓకే చెప్పిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగులో శాకుంత‌లం, ఖుషి, య‌శోద సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇవి రానున్న రోజుల్లో విడుద‌ల కానున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment