Samantha : నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత సమంత బిజీగా మారింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే మై మామ్ సెయిడ్ పేరిట ఆమె ఎప్పటికప్పుడు పలు ప్రత్యేకమైన కోట్స్ ను షేర్ చేస్తూ తన మనస్సులో ఉన్న బాధను పరోక్షంగా బయట పెడుతోంది.
ఇక తాజాగా సమంత షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ గా మారింది. తనకు అత్యంత కావల్సిన ప్రత్యేకమైన వ్యక్తి అయిన తన తల్లి తనకు పంపిన ఓ సందేశంతో కూడిన వాట్సాప్ చాట్‌ను సమంత షేర్ చేసింది. అందులో ఆమె తల్లి ఓ కొటేషన్‌ను పంపినట్లు గమనించవచ్చు. అందులో.. నీకు దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి తల్లీ.. అంటూ సమంత తల్లి మెసేజ్ పంపడాన్ని చూడవచ్చు. దాంతోపాటు పైనే ఓ కొటేషన్ కూడా ఉంది.
దీన్ని బట్టి చూస్తే విడాకుల ప్రకటన తరువాత సమంతకు తన తల్లి నుంచి సపోర్ట్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె తనకు పంపుతున్న కోట్స్‌నే సమంత తన సోషల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే ఇలాంటి ఎన్నో కోట్స్‌ను సమంత షేర్ చేయగా.. అన్నింటిలోనూ ఆమె విడాకులతో తీవ్ర మనస్థాపం చెందినట్లు అర్థమవుతోంది.
ఇక సమంత ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్‌తోపాటు త్వరలో ఓ హాలీవుడ్ మూవీలోనూ ఆమె నటించనుంది. పుష్ప సినిమాలో సమంత ఓ ప్రత్యేక పాటలో సందడి చేయనుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…