Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఇందులో రానా కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ రాస్తున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు సినిమాపై అంచనాలను మరితంగా పెంచేశాయి.
భీమ్లా నాయక్ అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ నుంచి తాజాగా 4వ పాటను విడుదల చేశారు.
భీమ్లానాయక్ నుంచి అడవి తల్లి అనే పాటను నిజానికి డిసెంబరు 1వ తేదీనే విడుదల చేయాలనుకున్నారు. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి సంతాపంగా ఆ పాట విడుదలను వాయిదా వేశారు. ఈక్రమంలోనే ఆ పాటను డిసెంబరు 4న (శనివారం) ఉదయం 10.08 గంటలకు విడుదల చేశారు. ఇక ఈ పాట తాజాగా విడుదల కాగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అడవితల్లి మాట అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు.
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా భీమ్లా నాయక్ ను తెరకెక్కిస్తున్నారు. మలయాళ సినిమాలో పోలీసు ఆఫీసర్ గా బిజూ మేనన్ నటించగా.. ఆ పాత్రను పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. మరో కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించగా.. ఆ పాత్రలో రానా దగ్గుబాటి నటించారు.
ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్, రానా పక్కన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇక రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్ లు ఈ సినిమాలో పలు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.
ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా విమానాల రాకపోకల్లో ఏర్పడిన అంతరాయాల మధ్య తమిళ నటుడు…
టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి…
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…