Bheemla Nayak : భీమ్లానాయక్ నుంచి నాలుగో పాట‌.. అడవితల్లి మాట.. అభిమానులు ఫుల్ హ్యాపీ..!

December 4, 2021 10:50 AM

Bheemla Nayak : ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం భీమ్లా నాయ‌క్‌.. ఇందులో రానా కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. సాగ‌ర్ కె చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైలాగ్స్ రాస్తున్నారు. దీంతో ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన పోస్ట‌ర్స్, పాట‌లు సినిమాపై అంచ‌నాల‌ను మ‌రితంగా పెంచేశాయి.

Bheemla Nayak 4th song adavi thalli maata released

భీమ్లా నాయ‌క్ అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 12న విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఈ మూవీ నుంచి తాజాగా 4వ పాట‌ను విడుద‌ల చేశారు.

భీమ్లానాయక్ నుంచి అడవి తల్లి అనే పాటను నిజానికి డిసెంబరు 1వ తేదీనే విడుదల చేయాల‌నుకున్నారు. కానీ సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతికి సంతాపంగా ఆ పాట విడుదలను వాయిదా వేశారు. ఈక్ర‌మంలోనే ఆ పాట‌ను డిసెంబరు 4న (శనివారం) ఉదయం 10.08 గంటలకు విడుద‌ల చేశారు. ఇక ఈ పాట తాజాగా విడుద‌ల కాగా అభిమానులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. అడవితల్లి మాట అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించారు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ సినిమాకు తెలుగు రీమేక్ గా భీమ్లా నాయక్ ను తెర‌కెక్కిస్తున్నారు. మలయాళ సినిమాలో పోలీసు ఆఫీసర్ గా బిజూ మేనన్ నటించగా.. ఆ పాత్రను పవన్ కల్యాణ్ పోషిస్తున్నారు. మరో కీలక పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ న‌టించ‌గా.. ఆ పాత్రలో రానా దగ్గుబాటి నటించారు.

ఈ సినిమాలో పవన్‌ సరసన నిత్యామీనన్, రానా ప‌క్క‌న‌ సంయుక్త మీనన్ న‌టిస్తున్నారు. ఇక రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను, కాదంబరి కిరణ్ లు ఈ సినిమాలో ప‌లు ఇత‌ర పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now