Samantha : త‌న‌కు కావ‌ల్సిన ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తితో స‌మంత వాట్సాప్ చాట్‌.. బ‌య‌ట పెట్టేసిందిగా..!

December 4, 2021 10:06 AM

Samantha : నాగ‌చైత‌న్య‌తో విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన త‌రువాత స‌మంత బిజీగా మారింది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్ర‌మంలోనే మై మామ్ సెయిడ్ పేరిట ఆమె ఎప్ప‌టిక‌ప్పుడు ప‌లు ప్ర‌త్యేక‌మైన కోట్స్ ను షేర్ చేస్తూ త‌న మ‌న‌స్సులో ఉన్న బాధ‌ను ప‌రోక్షంగా బ‌య‌ట పెడుతోంది.

Samantha posted a whatsapp chat between her and her mother

ఇక తాజాగా స‌మంత షేర్ చేసిన ఓ ఫొటో వైర‌ల్ గా మారింది. త‌న‌కు అత్యంత కావ‌ల్సిన ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తి అయిన త‌న త‌ల్లి త‌న‌కు పంపిన ఓ సందేశంతో కూడిన వాట్సాప్ చాట్‌ను స‌మంత షేర్ చేసింది. అందులో ఆమె త‌ల్లి ఓ కొటేష‌న్‌ను పంపిన‌ట్లు గ‌మ‌నించ‌వ‌చ్చు. అందులో.. నీకు దేవుడి ఆశీర్వాదాలు ఉండాలి త‌ల్లీ.. అంటూ స‌మంత త‌ల్లి మెసేజ్ పంప‌డాన్ని చూడ‌వ‌చ్చు. దాంతోపాటు పైనే ఓ కొటేష‌న్ కూడా ఉంది.

దీన్ని బ‌ట్టి చూస్తే విడాకుల ప్ర‌క‌టన త‌రువాత స‌మంతకు త‌న త‌ల్లి నుంచి స‌పోర్ట్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆమె త‌న‌కు పంపుతున్న కోట్స్‌నే స‌మంత త‌న సోష‌ల్ ఖాతాల్లో పోస్ట్ చేస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇప్ప‌టికే ఇలాంటి ఎన్నో కోట్స్‌ను స‌మంత షేర్ చేయ‌గా.. అన్నింటిలోనూ ఆమె విడాకులతో తీవ్ర మ‌న‌స్థాపం చెందిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.

ఇక సమంత ప్ర‌స్తుతం ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. బాలీవుడ్‌తోపాటు త్వ‌ర‌లో ఓ హాలీవుడ్ మూవీలోనూ ఆమె న‌టించ‌నుంది. పుష్ప సినిమాలో స‌మంత ఓ ప్ర‌త్యేక పాట‌లో సంద‌డి చేయ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now