Samantha : నా బిడ్డకు అన్యాయం జరిగితే అసలు ఊరుకోము.. అక్కినేని కుటుంబంపై సమంత తల్లిదండ్రులు ఆగ్రహం..

October 3, 2021 12:24 PM

Samantha : నిప్పు లేనిదే పొగ రాదు.. అనే సామెత అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే సమంత, నాగచైతన్యల మధ్య మనస్పర్థలు ఉండటం వల్లే వీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ.. పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అందరూ ఊహించిన విధంగానే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సమంత, నాగచైతన్య నాలుగేళ్ళ వివాహబంధంలో గత కొన్ని రోజుల నుంచి మనస్పర్ధలు రావడం వల్లే విడాకులకు కారణమయ్యాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Samantha : నా బిడ్డకు అన్యాయం జరిగితే అసలు ఊరుకోము.. అక్కినేని కుటుంబంపై సమంత తల్లిదండ్రులు ఆగ్రహం..

ఇదిలా ఉండగా శనివారం నాగచైతన్య తన విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో సమంత ఎంతో ఎమోషనల్ అయినట్టు మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తమ కూతురు విడాకుల విషయంపై సమంత తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు అక్కినేని కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పెళ్లి తర్వాత సమంత విషయంలో అక్కినేని కుటుంబం చాలా టూ మచ్ గా బిహేవ్ చేశారని తనని సినిమాటిక్ గా కాకుండా.. సాంప్రదాయబద్ధంగా ఉండాలంటూ తనపై ఎంతో ఒత్తిడి తీసుకువచ్చారని.. అక్కినేని కుటుంబం తమ కూతురిని పెట్టిన బాధలను సమంత తల్లిదండ్రులు తమ సన్నిహిత వర్గాలతో చెప్పుకొని ఆ కుటుంబంపై శాపాలు పెట్టినట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now