Samantha Naga Chaithanya : నెల రోజుల ముందే విడాకులు తీసుకోవాల‌నుకున్నారు ? ఆ కార‌ణం వ‌ల్ల కొన్ని రోజులు వాయిదా వేశారు..!

October 4, 2021 6:21 AM

Samantha Naga Chaithanya : అక్కినేని నాగ చైతన్య, సమంత ఇద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే నిజానికి ఈ ఇద్దరూ నెల రోజుల కిందే విడాకులు తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే అందుకు కారణం కూడా ఉందని తెలుస్తోంది.

Samantha Naga Chaithanya : నెల రోజుల ముందే విడాకులు తీసుకోవాల‌నుకున్నారు ? ఆ కార‌ణం వ‌ల్ల కొన్ని రోజులు వాయిదా వేశారు..!

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ల‌వ్‌ స్టోరీ మూవీ ఇటీవలే విడుదల అయి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే నెల రోజుల ముందుగానే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటిస్తే ఆ ప్రభావం సినిమాపై పడుతుందని భావించారట. దీంతో మూవీ విడుదల అయ్యాకే విడాకుల ప్రకటన చేయాలని నిర్మాతలు కోరారట. అందువల్లే ఈ ఇద్దరూ తమ విడాకుల ప్రకటనను నెల రోజులపాటు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక లవ్ స్టోరీ మూవీ విడుదల అయ్యింది కాబట్టి, ఆల్రెడీ 10 రోజులు అవుతుంది కాబట్టి, ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించినా.. ఏమీ కాదు. సినిమాపై అంత‌గా ప్ర‌భావం ప‌డ‌దు. కనుక ఇదే సరైన సమయం అని భావించి.. ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చైతన్య లవ్ స్టోరీ మూవీపై అతని విడాకుల ప్రభావం పడకుండా ఉండడానికే ఇన్ని రోజుల వరకు వారి విడాకుల నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

అయితే కొందరు మాత్రం మూవీ విడుదలకు ముందు విడాకుల ప్రకటన చేసి ఉంటే అది చైతూకి ప్లస్ పాయింట్ అయి ఉండేదని, ప్రేక్షకుల్లో సింపతీ వచ్చి సినిమా ఇంకా బాగా నడిచేదని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా వారు ఇద్దరూ విడాకులు తీసుకున్న విషయం మాత్రం నిజం. దాన్ని కాదనలేం. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now