Samantha Naga Chaithanya : అక్కినేని ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌.. సమంత – నాగ చైతన్య విడాకుల విషయంలో ట్విస్ట్.. బిగ్ సర్‌ప్రైజ్‌..

September 30, 2021 10:10 AM

Samantha Naga Chaithanya : గత కొద్ది రోజుల నుంచి సమంత, నాగ చైతన్య విడాకుల విషయం గురించి సోషల్ మీడియాలో పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. త్వరలోనే వీరు విడిపోతున్నానంటూ వార్తలు షికార్లు చేసినప్పటికీ ఈ వార్తలపై ఎవరూ స్పందించక పోవడం గమనార్హం. నాగచైతన్య లవ్ స్టోరీ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. సమంత తన స్నేహితులతో కలిసి హాలిడే వెకేషన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరి గురించి వస్తున్న వార్తలపై స్పందించకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి.

Samantha Naga Chaithanya : అక్కినేని ఫ్యాన్స్‌ కు గుడ్‌ న్యూస్‌.. సమంత - నాగ చైతన్య విడాకుల విషయంలో ట్విస్ట్.. బిగ్ సర్‌ప్రైజ్‌..
Samantha Naga Chaithanya

తాజాగా సమంత తన దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా అభిమానులతో ముచ్చటించింది. తను ముంబైకి షిఫ్ట్ అవ్వడం లేదని తనకు లైఫ్ ఇచ్చిన హైదరాబాద్ తన హోమ్ టౌన్ అంటూ తెలియజేసింది. ఇలా ముంబైకి వెళ్లడం లేదని చెప్పింది.. కానీ విడాకుల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న వార్తలను రూమర్లు అని కొట్టిపారేసింది.

ప్రస్తుతం సమంత తన స్నేహితులతో కలిసి హాలిడే వెకేషన్ కి వెళ్ళడానికి కూడా ఒక కారణం ఉందని, నాగ చైతన్య, సమంత ఎలాంటి విడాకులు తీసుకోకుండా, త్వరలోనే పిల్లలను కనాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పిల్లలు కావాలనుకుంటున్న సమంత అలా హాలిడే వెకేషన్ కు వెళ్లిందని, అందుకోసమే తన తర్వాత సినిమాలను కూడా ఏవీ ఒప్పుకోవడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలే కనుక నిజమైతే అక్కినేని అభిమానులకు ఇంతకన్నా మరోక శుభవార్త ఉండదని చెప్పవచ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now