Samantha Naga Chaitanya : నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకుంటారని ఎవరూ కూడా ఊహించి ఉండరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగేళ్లకే విడిపోవడం అభిమానులని చాలా బాధిస్తోంది. అప్పటి వరకు ఎంతో ఆన్యోన్యంగా ఉంటూ వచ్చిన వారిద్దరూ ఉన్నట్లుండి విడిపోతున్నామంటూ ప్రకటించడంపై ఫ్యాన్స్ సహా సినీ లోకం ఆశ్చర్యపోయింది. అయితే వారిద్దరరూ ఎందుకు విడిపోతున్నారో ఎక్కడా బయటకు చెప్పలేదు. విడిపోయిన తర్వాత ఇద్దరూ వారి వారి లైఫ్‌లను లీడ్ చేస్తున్నారు. ఎక్కడా ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకోలేదు. ఎవరిపని వారి చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
విడిపోయిన సమంత, నాగ చైతన్య వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. లవ్‌స్టోరీ, బంగార్రాజు సినిమాలతో నాలుగు నెలల గ్యాప్‌లోనే రెండు బ్లాక్ బస్టర్ విజయాలను సాధించాడు నాగ చైతన్య. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న థాంక్యూ, లాల్ సింగ్ చద్ధా.. సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. ప్రస్తుతం ఈయన వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇదిలా ఉండగా నాగచైతన్య మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నట్లు సమాచారం. సమంతతో ఓ బేబీ చిత్రాన్ని తెరకెక్కించిన నందిని రెడ్డి దర్శకత్వంలో చైతూ ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. అందులో కథానాయికగా సమంతని అనుకున్నారు.
కానీ వీళ్ళీద్దరు విడాకులు తీసుకోవడంతో ఈ ప్రాజెక్ట్‌కు పోస్ట్ పోన్ అయింది. అయితే నాగచైతన్యలను, సమంతలను ఒప్పించే పనిలో ఉన్నారని సమాచారం. చైతూ వైపు నుంచి సానుకూల స్పందన ఉందని, సమంతని ఒప్పించే పనిలో నందినిరెడ్డి గట్టి ప్రయత్నం చేస్తుందని సమాచారం. మరి ఇందులో నిజమెంతోగానీ ఇప్పుడీ వార్త నెట్టింట వైరల్ అవడంతోపాటు హాట్ టాపిక్‌గానూ మారింది. ఇది జరిగితే మాత్రం అభిమానుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. చైతూ, సమంత కలిసి దాదాపు నాలుగు సినిమాల్లో నటించారు. ఏం మాయ చేశావె, ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ.. సినిమాలు చేశారు. మ్యారేజ్ తర్వాత మజిలీలో నటించారు. ఈ సినిమాతో సూపర్ హిట్‌ని అందుకున్నారు. మరోవైపు ఓ బేబీలో సమంత కీరోల్ చేయగా.. నాగచైతన్య గెస్ట్ రోల్ చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…