Bhagyashree : రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన అలనాటి హీరోయిన్ భాగ్య శ్రీ. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించిన భాగ్యశ్రీ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. 32 ఏళ్ల క్రితం మైనే ప్యార్ కియాతో మెరిసిన ఆ మెరుపు మళ్లీ ఇప్పుడు తళుక్కుమంది. అది కూడా 53 ఏళ్ల ప్రాయం వచ్చినా.. చెక్కుచెదరని శరీర సౌష్టవం, అందమైన సొగసుతో కనిపిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఆరోగ్యంగా జీవించడం బరువు తగ్గడంలో ముఖ్యమైన భాగం. అయితే బరువు తగ్గడానికి అనుకూలమైన ఆహారాన్ని అనుసరించే విషయానికి వస్తే, మనలో చాలా మందికి ఏమి తినాలో తెలియక తికమక పడుతుంటారు. వారికి భాగ్య శ్రీ పలు చిట్కాలు అందించింది.
మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా ? అయితే వాటర్ వెజిటేబుల్స్ తినండి. మన శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేయడానికి నీరు చాలా అవసరం. మన శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపడానికి నీటి ప్రాధాన్యత చాలా ఉంది. నీటి ద్వారా ట్యాక్సిన్స్ తొలగించబడతాయి. నీరు ఎక్కువగా ఉన్న కూరగాయలు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పొట్లకాయ, బచ్చలికూర, టొమాటో, క్యాబేజీ, దోసకాయ, పాలకూర, గుమ్మడికాయ వంటి కూరగాయల్లో నీరు ఎక్కువగా ఉంటుంది. ఈ కూరగాయల్లో డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. ఇవి జీర్ణక్రియకు దోహదపడతాయి. ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి.. అని పేర్కొంది.
డైట్‌లో ఉన్నవారికి లేదా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఇవి సరైన కూరగాయలు అని భాగ్య శ్రీ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేసింది. వారంలో ఏడు కూరగాయలను రోజుకు ఒకటి చొప్పున వండుకుని తింటే ఆరోగ్యానికీ మంచిది.. అందంగానూ ఉంటారు.. అని తన అభిప్రాయాన్ని తెలియజేసింది. పాన్ ఇండియా చిత్రం రాధేశ్యామ్‌తో భాగ్యశ్రీ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 80, 90లలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ వెలుగు వెలిగిన ఆమె పెళ్లి అనంతరం సినిమాలకు దూరమయ్యారు. రాధేశ్యామ్‌లో ప్రభాస్‌కు తల్లి పాత్రతో ఆమె మళ్లీ వెండితెరపై అలరించారు. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా భాగ్యశ్రీ ప్రస్తుతం బాలీవుడ్‌లో అన్నీ పాత కథలు, కాపీ స్క్రీప్ట్స్ వస్తున్నాయని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…