Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. తన నటనతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతోపాటు తనదైన సామాజిక సేవా కార్యక్రమాలతో మహోన్నత వ్యక్తిగా పేరుపొందారు. సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు పలు యాడ్స్‌లో నటిస్తూ ఉన్నారు. ఆయన తాజాగా శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాడిసర్‌గా ఉన్నారు. పుష్ప చిత్రంతో భారతదేశం గర్వించదగ్గ దర్శకుల జాబితాలో చేరిన జీనియస్ దర్శకుడు సుకుమార్ గారి దర్శకత్వంలో, నట శిఖరం చిరంజీవి ఈ యాడ్ కోసం పని చేశారు. తాజాగా ఈ యాడ్‌కి సంబంధించిన ఫొటోలు విడుదల చేయగా, ఇప్పుడు వీడియో విడుదలైంది.
యాడ్ లో మెగాస్టార్ తో పాటు ఖుష్బు, అనసూయ భరద్వాజ్ కనిపించగా, ఒక మంచి ట్విస్ట్ తో హ్యాపీ న్యూస్ ను రెవీల్ చేశారు. ఉగాది పర్వదినాన విడుదలైన ఈ యాడ్ మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది. యాడ్‌లో చిరంజీవి అద్దంలో చూసుకుంటూ తల దువ్వుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఫోన్ కాల్ వస్తుంది. తన ఫ్రెండ్ గౌతమి ఫోన్ చేసిందని ఇంటి నుంచి హడావిడిగా బయలుదేరుతాడు చిరు. అయితే, ఇంత హడావిడి ఎందుకని రేఖ (ఖుష్బు) అనుమానపడుతుంది. ఆ అనుమానంతోనే ఆటోలో చిరుని ఫాలో అవుతూ వెళుతుంది.
చిరంజీవి శుభగృహ ఆఫీసుకు వెళ్లగా.. అక్కడ అనసూయ ఇంత లేట్ అయిందని అనడం, ఆ తర్వాత స్లిప్ కాబోగా.. చిరంజీవి పట్టుకోవడం, కోపంతో రేఖ కర్ర పట్టుకోవడం జరిగిపోతాయి. కట్ చేస్తే ఈ రోజు తన భార్య రేఖ పుట్టిన రోజని, సొంతిల్లు తన కల అని, అది సాకారం ఈ రోజు చేయాలనుకుంటున్నానని చిరు చెప్తాడు. శుభ గృహ వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన ఇంటిపత్రాలను తన భార్య రేఖ బర్త్ డే సందర్భంగా చిరు అందజేస్తాడు. అలా యాడ్ ముగుస్తుంది. మొత్తానికి యాడ్‌ని కాస్త డిఫరెంట్‌గా తీశారని చెప్పొచ్చు. చిరంజీవిపై ఖుష్బూకి అనుమానం కలిగేలా చేయడం, అనసూయతో చిరు ఏదో వ్యవహరం నడుపుతున్నాడనే ఆలోచన కలిగించడం.. కాస్త ఆసక్తిని రేకెత్తించింది. ఈ క్రమంలోనే ఈ యాడ్ వైరల్‌గా మారింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…