Samantha : నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత తెగ యాక్టివ్ అయింది. సినిమాలు, సోషల్ మీడియా, యాడ్స్ ఇలా ఒకటేంటి.. నానా హంగామా చేస్తోంది. మొన్నటి వరకు కేవలం సౌత్ ఇండస్ట్రీకే పరిమితమైన సమంత.. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఈ వెబ్ సిరీస్‌లో నెగిటివ్ షేడ్స్‌లో ఉన్న పాత్రలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది సామ్. ఈ క్రేజ్‌తో బాలీవుడ్ ఆఫర్స్ అందుకుంటోంది. బాలీవుడ్‌లో మరో వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది సమంత. వరుణ్ ధవన్ హీరోగా నటించనున్న ఈ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించడానికి సమంత అంగీకరించినట్లు తెలుస్తోంది. కుమార్ మంగత్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నారు. నటీనటులు, మూవీ టీంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రస్తుతం సమంత నటించిన శకుంతలం, యశోద సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా తమిళంలో ఒక సినిమాను చేసిన ఈ అమ్మడు మరో వైపు తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఒక సినిమాను చేయబోతోంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నాడు.
సమంత ఇటు సౌత్, అటు నార్త్‌పై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఈ క్రమంలోనే సమంత కొత్త ఇంటి ప్రయత్నాలు చేస్తుండగా.. ఎట్టకేలకు ఫలించినట్లు తెలుస్తోంది. ముంబైలో సమంత రెండు సముద్ర ఫేసింగ్ ఫ్లాట్స్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రెండింటిలో ఒక దానిని సమంత కొనబోతోందట. ఒక్కో ఫ్లాట్ ఖరీదు రూ. 3 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు ఫ్లాట్స్ ఇంకా కన్‌స్ట్రక్షన్స్ జరుగుతున్నాయట. అప్పటి వరకు సమంత అద్దెకు ఉండనుందట. నిజానికి సమంత, నాగచైతన్య విడాకుల ప్రకటన చేయకముందు కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. సమంత ముంబై వెళ్లి పోతుంది.. అంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అది నిజం కాదని తాను హైదరాబాద్‌లోనే ఉంటానని ఆమె అప్పట్లో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో బీటౌన్ చెక్కేయనుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…