Samantha : హైద‌రాబాద్‌కు టాటా చెప్పేయ‌బోతున్న స‌మంత‌.. ఇకపై తాను ఉండ‌బోయేది అక్క‌డే..?

April 3, 2022 7:31 PM

Samantha : నాగ చైత‌న్య నుండి విడిపోయిన త‌ర్వాత స‌మంత తెగ యాక్టివ్ అయింది. సినిమాలు, సోష‌ల్ మీడియా, యాడ్స్ ఇలా ఒక‌టేంటి.. నానా హంగామా చేస్తోంది. మొన్నటి వరకు కేవలం సౌత్‌ ఇండస్ట్రీకే పరిమితమైన సమంత.. ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఈ వెబ్‌ సిరీస్‌లో నెగిటివ్‌ షేడ్స్‌లో ఉన్న పాత్రలో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది సామ్‌. ఈ క్రేజ్‌తో బాలీవుడ్ ఆఫ‌ర్స్ అందుకుంటోంది. బాలీవుడ్‌లో మరో వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది సమంత. వరుణ్‌ ధవన్‌ హీరోగా నటించనున్న ఈ వెబ్‌ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.

Samantha may shift to Mumbai from Hyderabad
Samantha

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా వస్తున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా నటించడానికి సమంత అంగీకరించినట్లు తెలుస్తోంది. కుమార్ మంగత్ ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించనున్నారు. నటీనటులు, మూవీ టీంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్ర‌స్తుతం స‌మంత న‌టించిన‌ శకుంతలం, యశోద సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా తమిళంలో ఒక సినిమాను చేసిన ఈ అమ్మడు మరో వైపు తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఒక సినిమాను చేయబోతోంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నాడు.

స‌మంత ఇటు సౌత్, అటు నార్త్‌పై ప్ర‌త్యేక దృష్టి పెడుతోంది. ఈ క్ర‌మంలోనే సమంత కొత్త ఇంటి ప్రయత్నాలు చేస్తుండ‌గా.. ఎట్టకేలకు ఫలించినట్లు తెలుస్తోంది. ముంబైలో సమంత రెండు స‌ముద్ర‌ ఫేసింగ్ ఫ్లాట్స్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆ రెండింటిలో ఒక దానిని సమంత కొనబోతోందట. ఒక్కో ఫ్లాట్ ఖరీదు రూ. 3 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ రెండు ఫ్లాట్స్ ఇంకా క‌న్‌స్ట్ర‌క్షన్స్ జరుగుతున్నాయట. అప్పటి వ‌ర‌కు స‌మంత అద్దెకు ఉండ‌నుంద‌ట‌. నిజానికి సమంత, నాగచైతన్య విడాకుల‌ ప్రకటన చేయకముందు కూడా ఇలాంటి ప్రచార‌మే జరిగింది. సమంత ముంబై వెళ్లి పోతుంది.. అంటూ అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో అది నిజం కాదని తాను హైదరాబాద్‌లోనే ఉంటానని ఆమె అప్పట్లో చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు అక్క‌డ ఆఫ‌ర్స్ వ‌స్తున్న నేప‌థ్యంలో బీటౌన్ చెక్కేయ‌నుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment