Raisins : కిస్మిస్‌లను సహజంగానే చాలా మంది వివిధ రకాల తీపి వంటకాల్లో వేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కనుక వీటిని తినేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే వీటిని సరైన సమయంలో తింటేనే ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని ఉదయం పరగడుపునే తినాలి. అప్పుడే వీటితో కలిగే అన్ని బెనిఫిట్స్‌ను పొందవచ్చు. ఇక రాత్రి పూట 20 కిస్మిస్‌లను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపునే వాటిని తినాలి. దీంతో అనేక లాభాలను పొందవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కిస్మిస్‌లలో బి విటమిన్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌లలా పనిచేస్తాయి. దీని వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లకు అడ్డుకట్ట వేయవచ్చు.
2. కిస్మిస్‌లలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది మన ఎముకలు, దంతాలను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. కనుక కిస్మిస్‌లను తింటే శరీరం దృఢంగా మారుతుంది.
3. ఉదయాన్నే చాలా మంది వ్యాయామం చేస్తుంటారు. కొందరు రోజు మొత్తం శారీరక శ్రమను అధికంగా చేస్తుంటారు. అలాగే కొందరికి రోజంతా శక్తి లేనట్లు బలహీనంగా అనిపిస్తుంటుంది. ఏ పని చేయలేకపోతుంటారు. నిస్సత్తువగా ఉంటుంది. అయితే వీరందరూ రోజూ పరగడుపునే కిస్మిస్‌లను తింటే శక్తి లభిస్తుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. ఎంత పని చేసినా అలసిపోరు. చురుగ్గా ఉంటారు.
4. కిస్మిస్‌లను తింటే జీర్ణవ్యవస్థ మొత్తం శుభ్రమవుతుంది. గ్యాస్, మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి బయట పడవచ్చు.
5. కిస్మిస్‌లను తింటే శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరగా ఖర్చవుతాయి. దీంతో కొవ్వు కరుగుతుంది. ఫలితంగా అధిక బరువు తగ్గుతారు. ఇక వీటిని తినడం వల్ల ఐరన్ బాగా లభిస్తుంది. దీంతో రక్తం బాగా తయారవుతుంది. ఫలితంగా రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
6. కిస్మిస్‌లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…