Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

December 1, 2021 1:38 PM

Samantha : విడాకుల ప్రకటన తర్వాత సమంత పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టింది. విడాకుల విషయం గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వచ్చింది. ఇక ఈమె పూర్తిగా తన వ్యక్తిగత విషయాల గురించి పక్కనపెట్టి సినిమాలపై శ్రద్ధ చూపిస్తోంది. ఈ క్రమంలోనే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

సమంత ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవ‌డంతో ఈమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువ‌గా వస్తున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థ అయిన యష్‌ రాజ్‌ ఫిలిమ్స్ సంస్థతో సమంత సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నిర్మాణ సంస్థలో సమంత పని చేయడానికి దాదాపు అనుకూలంగా ఉన్నట్లు సమాచారం.

ఈ నిర్మాణ సంస్థతో సమంత‌ ఒప్పందం కుదుర్చుకుంటే ఒకే సారి రెండు, మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంటారనే సమాచారం వినబ‌డుతోంది. ఇదే కనుక నిజమైతే సమంత ఒకేసారి మూడు నాలుగు సంవత్సరాల పాటు తెలుగు తెరకు దూరమవుతుందని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో అనుష్క శర్మ, కరీనా కపూర్ వంటి సెలబ్రిటీలు కూడా ఈ నిర్మాణ సంస్థలో పనిచేసి స్టార్ సెలబ్రెటీలుగా మారిన వారే. అయితే సమంత ఈ నిర్మాణ సంస్థతో ఒప్పందం గురించి అధికారికంగా తెలపాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment