Samantha : స‌మంత‌ను సెకండ్ హ్యాండ్ అన్న నెటిజ‌న్.. ఇంత కూల్‌గా స్పందించిందేంటి ?

December 22, 2021 3:10 PM

Samantha : నాగ చైత‌న్య నుండి విడాకులు తీసుకొని సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా మారింది స‌మంత‌. ఈ ముద్దుగుమ్మ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న విడుద‌ల కాగా, ఈ చిత్రానికి య‌శోద అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతోపాటు హిందీ భాషలోనూ తెరకెక్కిస్తున్నారు.

Samantha is second hand says netizen she has given reply

అయితే అక్టోబర్ 2న నాగ చైతన్య – సమంత విడిపోతున్న‌ట్టు ప్రకటించారు. విడిపోవడానికి కారణాలు మాత్రం చెప్పలేదు. స‌మంత, నాగ చైత‌న్య‌ విడాకుల ప్రకటన తర్వాత ఓ నెలంతా వీరి విడాకుల అంశంపైనే సోషల్ మీడియా వేదికగా చర్చ జరిగింది. ఆ సంగతి పక్కన పెడితే నాగ చైతన్యతో డైవోర్స్ అనంతరం సమంత సోషల్‌ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది. త‌న‌పై వ‌స్తున్న ట్రోలింగ్స్‌కు గ‌ట్టిగానే స‌మాధానం ఇస్తోంది.

తాజాగా ఓ నెటిజ‌న్ స‌మంత‌ను దారుణంగా దుర్బాష‌లాడాడు. విడాకులు తీసుకున్న ఓ సెకండ్‌ హ్యాండ్‌ ఐటమ్‌ అంటూ దారుణంగా దూషించాడు. అంతేకాకుండా జెంటిల్మన్ (నాగ చైతన్య) నుంచి అప్పనంగా రూ. 50కోట్లు దోచుకుందంటూ ట్వీట్‌ చేశాడు. దీనిపై స్పందించిన సమంత.. నిన్ను ఆ దేవుడు చల్లగా దీవించుగాక.. అంటూ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment