Samantha : విడాకుల తర్వాత భావోద్వేగమైన పోస్టు చేసిన సమంత..!

October 2, 2021 8:09 PM

Samantha : గత కొన్ని రోజుల నుంచి సమంత నాగచైతన్య గురించి వస్తున్న వార్తలు నిజమంటూ నాగచైతన్య నేడు అధికారిక ప్రకటన చేశారు. నాగచైతన్య ఈ వార్త చెప్పగానే ఎంతో మంది అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చేదు వార్తను అభిమానులు జీర్ణించుకోలేక పోయారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో స్వీట్ కపుల్ గా ఉండే వీరు విడిపోవటం అభిమానులకు నిజంగానే చేదు వార్తే. నాగచైతన్య విడాకుల ప్రకటన చేసిన తర్వాత సమంత సోషల్ మీడియా వేదికగా ఎంతో భావోద్వేగమైన పోస్ట్ ను ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పోస్ట్‌ చేసింది.

Samantha : విడాకుల తర్వాత భావోద్వేగమైన పోస్టు చేసిన సమంత..!

ఈ సందర్భంగా సమంత స్పందిస్తూ.. ఎంతో బాధ, నిస్పృహలో ఉన్న సమయంలో ఒక విషయం నాకు అర్థం అయింది. చివరికి ప్రేమ గెలుస్తుందనేది జగమెరిగిన సత్యం. కొందరు హంతకులు, నమ్మకద్రోహులు, దుర్మార్గులు ఉంటారు. ఎన్నో కుట్రలు చేసి కనబడకుండా ఉండడంలో వారికి వారే సాటి. అలాంటి వారు జీవితంలో నాశనం అవుతారు. ఇది చరిత్ర చెబుతున్న నిజం. ఇది మా అమ్మ నాకు చెప్పిన నిజం.. అంటూ తన స్టోరీని ముగించింది.

ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఈ స్టోరీ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. అయితే సమంత ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసింన్నది సస్పెన్స్‌గా మారింది. మొత్తానికి విడాకుల ప్రకటన అనంతరం సమంత చేసిన ఈ పోస్ట్ ఎంతో బాధతో చేసిందని, తన అమ్మ చెప్పిన విషయాన్ని ఇలా విడాకుల తర్వాత బయట పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment