Samantha : తప్పు చేసింది సమంతనే.. సీనియర్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..!

October 6, 2021 8:55 AM

Samantha : గత కొద్దిరోజులుగా సమంత, నాగ చైతన్యల గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కథనాలు వినిపించాయి. ఈ క్రమంలోనే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వచ్చిన వార్తలు నిజమేనని అక్టోబర్ 2వ తేదీన ఈ దంపతులు అధికారికంగా ప్రకటించారు. ఒక్కసారిగా సమంత, నాగచైతన్య విడాకుల విషయం తెలియగానే ఎంతో మంది సినీ సెలబ్రిటీలు, అభిమానులు షాక్ కి గురయ్యారు.

Samantha done mistake says senior journalist

ఇకపోతే సమంత విడాకుల విషయం గురించి పలువురు సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ తమదైన శైలిలో కామెంట్లు చేశారు. ఇది వారి వ్యక్తిగత నిర్ణయమని.. ప్రతి ఒక్కరూ వారి నిర్ణయాన్ని గౌరవించాలని ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే  సమంత తండ్రి జోసెఫ్ ప్రభు తన కూతురి విడాకుల విషయంపై స్పందిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Samantha : తప్పంతా సమంతదే

సమంత విడాకుల విషయం వినగానే మైండ్ బ్లాక్ అయిపోయింది. అయితే ఈ విషయంలో సమంత ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని భావిస్తున్నాను. త్వరలోనే పరిస్థితులన్నీ చక్కబడతాయి.. అన్నారు. అయితే.. సమంతపై సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, పరిశోధకుడు ఇమంది రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పంతా సమంతదేనని అన్నారు.

Samantha done mistake says senior journalist

చిన్న చిన్న అపార్దాలు ఏ దాంపత్యంలో అయినా వస్తాయి. నాగార్జున చాలా వైడ్‌‌గా ఆలోచిస్తారు. వెనకాల సురేష్ బాబు, వెంకటేష్ బాబు ఉన్నారు. సమంత తొందరపడినా వాళ్ళు తొందరపడరు. సమంత కూడా చాలా తెలివైంది. కానీ తెలివి ఎక్కువయ్యే ఈ నిర్ణయం తీసుకుంది. బంగారం లాంటి సంసారాన్ని కాళ్ళ దన్నుకుంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు.. ఓ ఆరు మాసాల తర్వాత మీరు కలిసి ఉండాలనుకుంటే ఆ అవకాశాన్ని కోర్టు కల్పిస్తుంది.. అన్నారు.

అయితే సమంతకు చైతన్య సరైన వాడని అన్నారు. కానీ తప్పు చేసింది సమంతే అన్నారు. సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదని, సరోగసి ప్రయత్నిద్దామని చెప్పిందని అన్నారు. ఇది మగవాడికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment