Samantha : సీన్ త‌ర్వాత కూడా వెక్కి వెక్కి ఏడ్చిన స‌మంత‌..!

November 22, 2021 9:32 AM

Samantha : పెళ్లి, విడాకుల త‌ర్వాత కూడా బిజీగా ఉన్న ఆర్టిస్టులు ఎవ‌రంటే స‌మంత అనే చెప్పాలి. ఈ అమ్మ‌డు విడాకుల త‌ర్వాత కూడా ప‌లు కార్య‌క్ర‌మాల‌తో బిజీ అయింది. గోవాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 52వ ‘భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం’ (ఇఫీ)లో పాల్గొన్న ఆమె .. ‘ఫ్యామిలీమ్యాన్‌–2’ వెబ్‌ సిరీస్‌లోని క్లిష్టమైన యాక్షన్‌ పాత్ర రాజీని తాను ఎంచుకోవడానికి కారణాన్ని వివరించారు. కొత్తదనం కోసం తపిస్తున్న నేను ఆ పాత్రను ఠక్కున పట్టేసుకున్నా అన్నారు సమంత.

Samantha cried heavily after film shooting scenes

52వ ‘ఇఫీ’లో భాగంగా ఫ్యామిలీ మ్యాన్‌ రూపకర్తలు రాజ్, డీకే, నటి సమంత, అమెజాన్‌ ఇండియా ఒరిజినల్స్‌కు హెడ్‌ అయిన అపర్ణా పురోహిత్‌లతో ‘మాస్టర్‌ క్లాస్‌’ గోష్ఠి జరిగింది. అందులో సమంత మాట్లాడుతూ, ‘‘తెలుగు పరిశ్రమ, హైదరాబాద్‌ నా పుట్టినిల్లు. నటిగా నాకు ఈ స్థానాన్ని ఇచ్చింది అవే. నేనింకా హిందీ సినిమాలేవీ చేయలేదు కానీ, ఉత్తరాది పరిశ్రమకూ, దక్షిణాదికీ పెద్ద తేడా ఏమీ లేదు’’ అన్నారు.

ఫ్యామిలీ మ్యాన్‌ 2’లోని పాత్రతో ఇక హిందీ ‘ధూమ్‌’ సిరీస్‌ లాంటి వాటిలో అవకాశాలు రావచ్చన్న ప్రేక్షకుల ప్రశంసకు సమంత ఉబ్బితబ్బిబ్బవుతూ, ‘‘నేనిక ‘యాక్షన్‌ స్టార్‌’ అన్న మాట’’ అని నవ్వేశారు.

దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే మాట్లాడుతూ, ‘‘రాజీ పాత్రకు తమిళం తెలిసిన నటి కావాలనుకున్నాం. తమిళ చిత్రం ‘సూపర్‌డీలక్స్‌’, తెలుగు ‘రంగస్థలం’ చూసి, ఆ పాత్రకు సమంత సరిపోతారనుకొని, సంప్రదించాం. మా అంచనాలను మించి ఆమె చేశారు. భావోద్వేగాల్లోనే జీవిస్తూ, కొన్ని సీన్లు కాగానే ఆమె వెక్కివెక్కి ఏడ్చిన ఘటనలు మాకు ఇప్పటికీ గుర్తే. చేతులకు గాయమై రక్తం కారుతున్నా డూప్‌లు లేకుండా సమంత చేసిన ఫైట్లు చూసి ఆశ్చర్యపోయాం’’ అన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment