Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. కెరీర్ పీక్స్‌లో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమంత పూర్తిగా కోలుకుంది. కోలుకున్న తర్వాత సమంత తన పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసే పనిలో పడింది. ఇటీవల శాకుంతలం ప్రమోషన్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గోన్న సమంత ఇప్పుడు విజయ్ దేవరకొండ ఖుషి.. వరుణ్ ధావన్ సరసన నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ పూర్తి చేయాలని అనుకుంటుంది.
సిటాడెల్ ప్రాజెక్ట్‌ని ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్- డీకేనే ఈ సిరీస్ ని కూడా తెరకెక్కిస్తున్నారు. సమంత షూటింగ్ లో పాల్గొన్న విషయాన్ని వారి సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తూ.. “ఈ పవర్ హౌస్ మరోసారి పనిచేయడానికి ఎంతో ఎక్జైటెడ్ గా ఉన్నాం. సిటాడెల్ ప్రపంచానికి స్వాగతం సమంత” అంటూ రాజ్- డీకే.. సమంత ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో సమంత లుక్ అదిరిపోయింది. హాలీవుడ్ లో రూసో బ్రదర్స్ నుంచి రాబోతున్న అతిపెద్ద టీవీ సిరీస్ ఇదే అవుతుందని, దీనితో సమంతకి మంచి పేరు వస్తుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
మరోవైపు విజయ్, సమంత కాంబోలో తెరకెక్కుతున్న ఖుషి కోసం తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఖుషికి ప్రయారిటీ ఇవ్వకుండా సిటాడెల్ గురించి ప్రకటించడం విజయ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. దీనితో ఓ అభిమాని ఖుషి సంగతి ఏంటి అంటూ ప్రశ్నించాడు. ఖుషి చిత్రాన్ని కూడా త్వరలోనే తిరిగి ప్రారంభిస్తాం.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నన్ను క్షమించండి అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి విజయ్ దేవరకొండ స్పందించాడు. చిరునవ్వుతో పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని మేమంతా ఎదురుచూస్తున్నాం అంటూ విజయ్ పోస్ట్ పెట్టారు. సమంత సిటాడెల్ కి బల్క్ అమౌంట్ లో డేట్స్ కేటాయించిన నేపథ్యంలో ఖుషీ ప్రాజెక్ట్ లో జాయిన్ కావాలంటే కొంత సమయం పట్టేలా కనిపిస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…