Samantha : విజ‌య్ దేవ‌ర‌కొండ అభిమానుల‌ని క్ష‌మించమ‌ని కోరిన స‌మంత‌.. అంత త‌ప్పు ఏం చేసింది..?

February 2, 2023 2:57 PM

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రించి టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. కెరీర్ పీక్స్‌లో దూసుకుపోతున్న సమంతకి ఆరోగ్య సమస్యలు బ్రేక్ వేశాయి. కొన్ని నెలల నుంచి సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల సమంత పూర్తిగా కోలుకుంది. కోలుకున్న త‌ర్వాత స‌మంత త‌న పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసే ప‌నిలో ప‌డింది. ఇటీవ‌ల శాకుంత‌లం ప్ర‌మోష‌న్స్‌లో చాలా యాక్టివ్‌గా పాల్గోన్న స‌మంత ఇప్పుడు విజయ్ దేవరకొండ ఖుషి.. వరుణ్ ధావన్ సరసన నటిస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్ పూర్తి చేయాల‌ని అనుకుంటుంది.

సిటాడెల్ ప్రాజెక్ట్‌ని ఫ్యామిలీ మ్యాన్ దర్శకులు రాజ్- డీకేనే ఈ సిరీస్ ని కూడా తెరకెక్కిస్తున్నారు. సమంత షూటింగ్ లో పాల్గొన్న విషయాన్ని వారి సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియ‌జేస్తూ.. “ఈ పవర్ హౌస్ మరోసారి పనిచేయడానికి ఎంతో ఎక్జైటెడ్ గా ఉన్నాం. సిటాడెల్ ప్రపంచానికి స్వాగతం సమంత” అంటూ రాజ్- డీకే.. సమంత ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఇందులో స‌మంత లుక్ అదిరిపోయింది. హాలీవుడ్ లో రూసో బ్రదర్స్ నుంచి రాబోతున్న అతిపెద్ద టీవీ సిరీస్ ఇదే అవుతుంద‌ని, దీనితో స‌మంత‌కి మంచి పేరు వ‌స్తుంద‌ని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

Samantha asked vijay deverakonda fans apology
Samantha

మరోవైపు విజయ్, సమంత కాంబోలో తెరకెక్కుతున్న ఖుషి కోసం తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఖుషికి ప్రయారిటీ ఇవ్వకుండా సిటాడెల్ గురించి ప్రకటించడం విజయ్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. దీనితో ఓ అభిమాని ఖుషి సంగతి ఏంటి అంటూ ప్రశ్నించాడు. ఖుషి చిత్రాన్ని కూడా త్వరలోనే తిరిగి ప్రారంభిస్తాం.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నన్ను క్షమించండి అంటూ రిప్లై ఇచ్చింది. దీనికి విజ‌య్ దేవ‌ర‌కొండ స్పందించాడు. చిరునవ్వుతో పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని మేమంతా ఎదురుచూస్తున్నాం అంటూ విజయ్ పోస్ట్ పెట్టారు. సమంత సిటాడెల్ కి బల్క్ అమౌంట్ లో డేట్స్ కేటాయించిన నేప‌థ్యంలో ఖుషీ ప్రాజెక్ట్ లో జాయిన్ కావాలంటే కొంత స‌మ‌యం ప‌ట్టేలా క‌నిపిస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now