గురువారం, జూన్ 11, 2026
వినోదం

Sam Bahadur OTT Release Date : విక్కీ కౌశల్ సామ్ బహదూర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుండి.. ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే..!

Sam Bahadur OTT Release Date : కెరీర్ ఆరంభం నుంచి ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ ఆడియెన్స్ ని అల‌రిస్తున్న హీరో విక్కీ కౌశ‌ల్. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న ఎక్కువ‌గా దేశభక్తి చిత్రాలతో చేస్తూ తనకంటూ ఓ…

Sam Bahadur OTT Release Date : విక్కీ కౌశల్ సామ్ బహదూర్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుండి.. ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే..!

Sam Bahadur OTT Release Date : కెరీర్ ఆరంభం నుంచి ప్రయోగాత్మక పాత్రలు చేస్తూ ఆడియెన్స్ ని అల‌రిస్తున్న హీరో విక్కీ కౌశ‌ల్. ఈ మ‌ధ్య కాలంలో ఆయ‌న ఎక్కువ‌గా దేశభక్తి చిత్రాలతో చేస్తూ తనకంటూ ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరుచుకున్నాడు విక్కీ. తాజాగా సామ్ బహదూర్ అనే మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు విక్కీ కౌశల్. సర్దార్ ఉద్దమ్ తర్వాత విక్కీ నటిస్తున్న బయోపిక్ ఇది కాగా, 1971లో ఇండో-పాక్ వార్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ యుద్ధంలో భారత్ విజయానికి కారణమైన “సామ్ మానెక్షాష‌ జీవిత కథ ఆధారంగా ఈ సామ్ బహదూర్ మూవీ తెర‌కెక్కింది.

డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా యానిమల్ తో పోటీ పడుతూ కూడా మంచి వసూళ్లే సాధించింది. ఇక ఇప్పుడీ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.దేశ భ‌క్తి నేప‌థ్యంలో రూపొందిన ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఉరి, సర్దార్ ఉధమ్ లాంటి దేశభక్తి సినిమాలు చేసిన విక్కీ.. ఇప్పుడు సామ్ బహదూర్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. గొప్ప దేశభక్తుడు సామ్ మానిక్‌ షా పాత్ర లో విక్కీ కనిపించాడు. ఈ సినిమా జీ5 ఓటీటీ లో జనవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Sam Bahadur OTT Release Date vikki kaushal movie
Sam Bahadur OTT Release Date

ఈ మూవీలో సామ్ మానెక్ష పాత్రలో విక్కీ కౌశల్ నటిస్తుండగా.. ఇందిరా గాంధీ పాత్రలో దంగల్ బ్యూటి సనా ఫాతిమా షేక్ కనపించనుంది. తా ఫీల్డ్ మార్షల్ గా సామ్ జంషద్ జీ మానెక్షా ఇండియన్ ఆర్మీని నాలుగు దశబ్దాల పాటు ముందుండి నడిపించారు. సామ్ బహదూర్ సినిమా ను మేఘన గుల్జార్ డైరెక్ట్ చేసింది. నిజానికి థియేటర్ల లో రిలీజైన మూడు, నాలుగు వారాల్లోనే ఓటీటీ లోకి వస్తుందన్న వార్తలు మొదట్లో వచ్చినా.. మేకర్స్ మాత్రం జనవరి 26న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా లో మానిక్‌ షా పాత్ర లో విక్కీ కౌశల్ నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి.సామ్ మానిక్‌ షా భారతదేశ తొలి ఫీల్డ్ మార్షల్. 1971లో పాకిస్థాన్ తో జరిగిన యుద్ధం లో ఇండియన్ ఆర్మీ చీఫ్ గా ఉన్నారు. దేశంలో ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ పొందిన తొలి ఆర్మీ అధికారి సామ్ మానిక్‌ షా. రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి మానిక్‌ షా ఆర్మీ లోనే ఉన్నారు. ఐదు యుద్ధా ల్లో తన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. 2008లో 94 ఏళ్ల వయసు లో కన్ను మూశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.