Salman Khan : చిరంజీవి, వెంకీ చిత్రాల‌లో స‌ల్మాన్ ఖాన్.. క‌న్‌ఫాం..!

December 3, 2021 8:38 AM

Salman Khan : ఈ మ‌ధ్య‌ మ‌న తెలుగు సినిమాల‌లో బాలీవుడ్ న‌టులు ఎక్కువ భాగం అవుతున్నారు. పాన్ ఇండియా చిత్రాల‌లో బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ కూడా న‌టిస్తున్నారు. తాజాగా స‌ల్మాన్ ఖాన్ టాలీవుడ్ హీరోల సినిమాల‌లో న‌టిస్తున్న‌ట్టు తెలియ‌జేశారు. సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం అంతిమ్‌. ది ఫైనల్‌ ట్రూత్‌.. అన్నది ఉపశీర్షిక. ఆయుష్‌ శర్మ కథానాయకుడుగా రూపొందిన ఈ చిత్రాన్ని మ‌హేష్ మంజ్రేక‌ర్ తెర‌కెక్కించారు.

Salman Khan to act in chiranjeevi and venkatesh films confirmed

రీసెంట్‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాగా, చిత్ర బృందంతో స‌ల్మాన్ హైద‌రాబాద్‌లో సంద‌డి చేశారు. తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకొనేందుకే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చా. ఆయుష్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. నా తర్వాతి చిత్రాలన్నీ కచ్చితంగా అన్ని భాషల్లో విడుదల చేస్తా. ప్రస్తుతం హిందీలో భాయీజాన్‌, దబాంగ్‌ 4, టైగర్‌ 3 చిత్రాలు చేస్తున్నా. తెలుగులో చిరంజీవి గాడ్‌ఫాదర్‌ చిత్రంలో నటిస్తున్నా.

నా పాత్రేంటి అని నేనడగలేదు. నా సినిమాలో చేయాలని చిరు అడిగారు.. ఎన్ని రోజులు కాల్షీట్లు కావాలని మాత్ర‌మే అడిగాను. త్వరలో వెంకటేష్‌తోనూ కలసి నటించబోతున్నా. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తానన్నారు. అంతిమ్‌ ప్రచారం కోసం నగరంలోని ఓ మాల్‌కు విచ్చేసిన సల్మాన్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. హైదరాబాద్‌ నాకు ఇష్టమైన ప్రదేశం. హైదరాబాద్‌ రాగానే బిర్యానీ రుచి చూశా.. అని ఆయ‌న చెప్ప‌డం విశేషం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now