గురువారం, జూన్ 11, 2026
వినోదం

Salaar OTT Release Date : స‌లార్ ఓటీటీ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. ఎప్ప‌టి నుండి అంటే..!

Salaar OTT Release Date : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం.. సలార్. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత…

Salaar OTT Release Date : స‌లార్ ఓటీటీ రిలీజ్ డేట్ వ‌చ్చేసింది.. ఎప్ప‌టి నుండి అంటే..!

Salaar OTT Release Date : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం.. సలార్. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత ఒంటి గంటకే బొమ్మ పడింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విడుదలైన అన్ని చోట్లా పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుందీ భారీ బడ్జెట్ మూవీ. హొంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మించారు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతిబాబు, బాబీ సింహా, టిన్నూ ఆనంద్.. ఇతర కీలక పాత్రల్లో నటించారు.ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది.

రికార్డు స్థాయిలో రూ.100 కోట్లకు సలార్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, ఫిబ్రవరి తొలి లేదా రెండో వారం నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. థియేటర్‌లలోకి ప్రవేశించిన సుమారు 45 నుండి 60 రోజుల తర్వాత బహుళ భాషలలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.. అయితే, మేకర్స్ నుండి ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. ఇక ఈ మూవీలో ప్రభాస్ దేవా/సలార్‌గా, పృథ్వీరాజ్ సుకుమారన్ వరదరాజ మన్నార్ పాత్రలో, జగపతి బాబు రాజమన్నార్‌గా, శృతి హాసన్ ఆద్యగా న‌టించి అల‌రించారు.

Salaar OTT Release Date know the platform and streaming details
Salaar OTT Release Date

స‌లార్ చిత్రంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడతో సహా పలు భాషల్లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద షారూఖ్ ఖాన్ ‘డుంకీ’తో సాలార్ పోటీ పడుతోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ దేశీయంగా రూ. 95 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 175 కోట్లను తొలి రోజునే వసూలు చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విలువైన రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని భావిస్తున్నారు.ఇదిలా ఉంటే ప్రభాస్- పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్‌ డిజిటల్ హక్కులను తీసుకుంది నెట్ ఫ్లిక్స్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో లాభాలను ఇవ్వలేదు. కొనుగోలు విషయంలో ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ నష్టపోయిందనేది ట్రేడ్ టాక్. ఇప్పుడు ఆ న‌ష్టాన్ని స‌లార్‌తో తీస‌ర్చుకోనుంద‌ని స‌మాచారం.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

వ్యాఖ్యలను మూసివేసారు.