Salaar : అప్‌డేట్ పేరుతో తెగ ఊరించిన సలార్ టీమ్ ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది. అది కూడా కొత్త పోస్టర్ తో. అయితే దీనికి చాలా వెయిటింగ్ పీరియడ్ పెట్టింది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే రాధేశ్యామ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన డార్లింగ్.. అది ఫెయిల్యూర్ ని మూటకట్టుకున్నప్పటికీ ఆ ఎఫెక్ట్ ఏమీ ప్రభాస్ నెక్స్ట్ మూవీపై పడలేదు. ఇప్పుడు చేతిలో అన్ని పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు.
మరోవైపు సలార్ మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. తాజాగా డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.
అందులో ప్రభాస్ కత్తి పట్టి నరికిన తీరు, ఆ శవాలు అలా పడి ఉండడం, రెండు చేతులతో రెండు కత్తులు పట్టి చేస్తోన్న యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన పోస్టర్ ను చూసి జనాలు ఫిదా అవుతున్నారు. చేతిలో రక్తంతో తడిసిన పదునైన ఆయుధాలతో పవర్ ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నాడు ప్రభాస్. ఇక సలార్ నుంచి ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పెషల్ అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. సలార్ మాత్రమే కాకుండా ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇప్పుడు నెట్టింట మొత్తం సలార్ మానియానే నడుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…