Salaar : అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన సలార్ టీమ్‌.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే..?

August 15, 2022 3:20 PM

Salaar : అప్‌డేట్ పేరుతో తెగ ఊరించిన సలార్ టీమ్ ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించింది. అది కూడా కొత్త పోస్టర్ తో. అయితే దీనికి చాలా వెయిటింగ్ పీరియడ్ పెట్టింది. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే రాధేశ్యామ్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చిన డార్లింగ్.. అది ఫెయిల్యూర్ ని మూటకట్టుకున్నప్పటికీ ఆ ఎఫెక్ట్ ఏమీ ప్రభాస్ నెక్స్ట్ మూవీపై పడలేదు. ఇప్పుడు చేతిలో అన్ని పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్నాడు.

మరోవైపు సలార్ మూవీ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సలార్ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. తాజాగా డార్లింగ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ప్రభాస్ కు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేశారు.

Salaar new poster and release date announced
Salaar

అందులో ప్రభాస్ కత్తి పట్టి నరికిన తీరు, ఆ శవాలు అలా పడి ఉండడం, రెండు చేతుల‌తో రెండు కత్తులు పట్టి చేస్తోన్న యాక్షన్ సీక్వెన్స్‌కు సంబంధించిన పోస్టర్ ను చూసి జనాలు ఫిదా అవుతున్నారు. చేతిలో రక్తంతో తడిసిన పదునైన ఆయుధాలతో పవర్ ఫుల్ లుక్‏లో కనిపిస్తున్నాడు ప్రభాస్. ఇక సలార్ నుంచి ఇండిపెండెన్స్ డే సందర్భంగా స్పెషల్ అప్‌డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. సలార్ మాత్రమే కాకుండా ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ చిత్రాల్లో నటిస్తున్నాడు డార్లింగ్ ప్రభాస్. ఇప్పుడు నెట్టింట మొత్తం సలార్ మానియానే నడుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now