Ram Charan : మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగిపోయిన చ‌ర‌ణ్ – శంక‌ర్ మూవీ..?

Ram Charan : గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్, భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు శంక‌ర్ ల క‌ల‌యికలో దిల్ రాజు నిర్మాత‌గా సినిమాని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. కియారా అద్వాని హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమా ప్రారంభం కార్య‌క్ర‌మం కూడా అట్ట‌హాసంగా జ‌రిగింది. మ‌నం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొంత‌ భాగం చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి చేసిన‌ట్టు తెలిపారు. అయితే మెగా అభిమానులు, తెలుగు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ఇప్పుడు వాయిదా ప‌డింద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇక ఈ వాయిదాకి క‌చ్చిత‌మైన కార‌ణాలు తెలియరాలేదు. కానీ తాజాగా క‌మ‌ల్ హాస‌న్ విక్ర‌మ్ సినిమా ఘ‌న విజ‌యం సాధించ‌డం వ‌ల్ల‌నే ఇలా అర్ధంత‌రంగా వాయిదా వేయ‌డానికి ముఖ్య కార‌ణం అని తెలుస్తోంది. ఇక విక్ర‌మ్ మూవీ మంచి హిట్ సాధించ‌డంతో ఇదివ‌ర‌కే మొద‌లై మ‌ధ్య‌లో ఆగిపోయిన శంక‌ర్ – క‌మ‌ల్ హాస‌న్ ల భార‌తీయుడు-2 చిత్రాన్ని తిరిగి పూర్తి చేయ‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని భావిస్తున్న‌ట్టు తెలిసింది.

Ram Charan

ఈ చిత్రం చుట్టూ ఉన్న కోర్టు వివాదాలు కూడా ముగిసిపోవ‌డంతో షూటింగ్ పునఃప్రారంభానికి ఉన్న అడ్డంకుల‌న్నీ తొల‌గిపోయాయి. ఈ క్ర‌మంలో రామ్ చ‌ర‌ణ్ సినిమాని ప‌క్క‌న పెట్టార‌ని స‌మాచారం. ఈ విరామంలోనే రామ్ చ‌ర‌ణ్ కూడా ఎవ్‌వీ ప్ర‌సాద్ ఇంకా యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో తాను చేయ‌బోయే త‌దుప‌రి సినిమాను పూర్తి చేయ‌న‌న్న‌ట్లు తెలుస్తోంది. హీరో నాని న‌టించిన జెర్సీ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన గౌత‌మ్ తిన్న‌నూరి ఈ చిత్రానికి కూడా డైరెక్ట‌ర్ గా చేయ‌నున్నారు. అయితే చ‌ర‌ణ్ సినిమా ఇలా ఆగిపోవ‌డంపై మెగా ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుందో.. రాదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM