Shriya Sharma : ఆడపిల్లలు చూస్తుండగానే ఎదిగిపోతారంటారు. ఇప్పుడు శ్రియ శర్మను చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. జై చిరంజీవ సినిమాలో చిరంజీవి మేనకోడలిగా నటించిన చిన్నారి గుర్తుందిగా. ఆమె శ్రియ శర్మ. అప్పుడు చిన్నపిల్లలా అందరి మనసులు దోచిన ఈ భామ వయసు ఇప్పుడు 24 ఏళ్లు. మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక కలిసి నటించిన చిత్రం జై చిరంజీవ. ఈ సినిమాలో చిరంజీవి ముద్దుల మేనకోడలుగా నటించిన అమ్మాయి శ్రియ శర్మ. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హిందీ, కన్నడ, తమిళ అన్ని భాషల్లోనూ వరుస అవకాశాలతో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకుంది.
నిజానికి మెగాస్టార్ జై చిరంజీవ సినిమా కంటే ముందుగానే ఈ అమ్మాయి సూర్య, జ్యోతిక కూతురుగా నువ్వు నేను ప్రేమ సినిమాలో నటించింది. ఆతర్వాత టాలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ.. కొన్నేళ్ల తర్వాత మహేష్ బాబు దూకుడు సినిమాలో సమంత చెల్లిగా ప్రత్యక్షం అయ్యింది. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస అవకాశాలతో కొంతకాలం దుమ్ములేపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా బిజీ కావడానికి ప్రయత్నాలు చేస్తోంది. మూడేళ్ల కిందట శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన నిర్మల కాన్వెంట్ లో ఈమె హీరోయిన్. అయితే నిర్మలా కాన్వెంట్ చిత్రంలో నటించిన తర్వాత నటి శ్రియ శర్మ బరువు పెరిగినట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య అమ్మడు బరువు తగ్గే పనిలో పడి జిమ్ వర్కవుట్లు, స్పెషల్ ఫుడ్ డైట్ వంటివి చేస్తూ బాగానే శ్రమిస్తోంది. సినిమాలు చేయకపోయినప్పటికీ సోషల్ మీడియా ద్వారా శ్రియ శర్మ అభిమానులకు దగ్గరగా ఉంటోంది. శ్రియ శర్మకి టాలీవుడ్ లో మళ్లీ అవకాశాలు వస్తే ఇక్కడా సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అస్సాం రైఫిల్స్ వారు పలు పోస్టుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గాను ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల…
బ్యాంకుల్లో ఉన్నత స్థానాల్లో ఉద్యోగం చేయాలని చూస్తున్నారా..? అయితే మీకు బ్యాంక్ ఆఫ్ బరోడా గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ…
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తూ స్థిరపడాలని అనుకుంటున్న వారి కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభ వార్త చెప్పింది.…
పబ్లిక్ సెక్టార్‌కు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి గాను ఆసక్తి,…
దేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి పలు…
రైల్వేలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల…
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేయాలని అనుకుంటున్నారా..? అయితే ఇది మీకు ఒక గొప్ప అవకాశం అని చెప్పవచ్చు. ఇండియన్ ఎయిర్…
పోస్టల్ శాఖలో ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారా..? అయితే ఈ సదకాశం మీకోసమే. తపాలా శాఖ వారు భారీ ఎత్తున ఉద్యోగ…