Sai Pallavi : వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై ఎట్ట‌కేల‌కు స్పందించిన సాయి ప‌ల్ల‌వి.. ఏమ‌న్న‌దంటే..?

June 18, 2022 10:42 PM

Sai Pallavi : గ‌త కొద్ది రోజులుగా న‌టి సాయిప‌ల్ల‌విపై సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోలింగ్ జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌కు గాను కొంద‌రు త‌ప్పు ప‌డుతుండ‌గా.. కొంద‌రు మాత్రం ఆమెను స‌మ‌ర్థిస్తున్నారు. ఆమె కాశ్మీర్‌లో కాశ్మీర్ పండిట్ల హ‌త్య‌లు, గోహ‌త్య‌లు రెండూ ఒక‌టేన‌ని.. పెద్ద‌గా తేడా ఏమీ లేద‌ని కామెంట్స్ చేసింది. విరాట ప‌ర్వం సినిమా రిలీజ్‌కు ముందు ఇలా కామెంట్స్ చేయ‌డంతో ఆమె త‌న సినిమాను ప్ర‌మోట్ చేసుకునేందుకే ఇలా అని ఉంటుంద‌ని.. ఇలాంటి సున్నిత‌మైన అంశాల‌పై కామెంట్ చేసేముందు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకోవాల‌ని కొంద‌రు ఆమెకు క్లాస్ పీకారు. ఇక కొంద‌రు అయితే ఆమెకు మ‌ద్దతుగా నిలిచారు. అయిన‌ప్ప‌టికీ ఈ వివాదం చిలికి చిలికి గాలివాన‌గా మారుతుండ‌డంతో ఎట్ట‌కేల‌కు సాయి ప‌ల్ల‌వి స్పందించింది. ఈమేర‌కు ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో ఆమె చెప్పిందంటే..

దేశంలో అనేక హింసాత్మ‌క సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయ‌ని.. వాటిని వివ‌రించేందుకు తాను కాశ్మీర్ పండిట్ల హ‌త్య‌ల‌ను, గోహ‌త్య‌ల‌ను రిఫ‌రెన్స్ గా తీసుకున్నాన‌ని.. అంతేకానీ.. ఒక‌రంటే త‌న‌కు ద్వేషం లేద‌ని సాయి ప‌ల్ల‌వి తెలియ‌జేసింది. అస‌లు మ‌తం ముఖ్యం కాద‌ని.. హింస ఏ రూపంలో ఏ మ‌తం ద్వారా జ‌రిగినా స‌మ్మ‌తం కాద‌ని.. దాన్ని మాత్ర‌మే తాను వివ‌రించి చెప్పాన‌ని.. అయితే తాను చేసిన అస‌లు కామెంట్స్‌ను చూపించ‌కుండా కొంద‌రు త‌న వీడియోను ఎడిట్ చేశార‌ని.. క‌నుక‌నే త‌న కామెంట్స్‌పై వివాదం నెల‌కొంద‌ని సాయిప‌ల్ల‌వి స్ప‌ష్టం చేసింది.

Sai Pallavi responded over her comments
Sai Pallavi

అయితే త‌న వ్యాఖ్య‌ల ద్వారా ఎవ‌రినైనా బాధ‌పెట్టి ఉంటే క్ష‌మించాల‌ని ఆమె కోరింది. హింస అనేది ప‌నికిరాద‌ని.. ఏ మ‌తం రూపంలో హింస జ‌రిగినా ఖండించాల్సిందేన‌ని తాను చెప్ప‌ద‌లుచుకున్నాన‌ని.. కానీ త‌న వ్యాఖ్య‌ల‌ను కొంద‌రు త‌ప్పుగా చూపించేస‌రికి వివాదం ఏర్ప‌డింద‌ని.. సాయి ప‌ల్ల‌వి తెలియ‌జేసింది. అయితే ఆమె క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని చాలా మంది డిమాండ్ చేస్తుండ‌గా.. ఎట్ట‌కేల‌కు ఆమె స్పందించి క్ష‌మాప‌ణ‌లు చెప్పేసింది. మ‌రి ఈ వివాదం ఇక్క‌డితో అయినా స‌ద్దుమ‌ణుగుతుందా.. లేక ఇంకా కొన‌సాగుతుందా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment