Sai Dharam Tej : సాయి ధరమ్ కోలుకుంటున్నాడు.. మీ ఆశీస్సులు కావాలంటూ చిరు ట్వీట్..

September 30, 2021 11:50 PM

Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ ఆరోగ్యం గురించి నెలకొన్న అయోమయ పరిస్థితులపై మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 10వ తేదీన సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన సాయి తేజ్ ఇప్పటివరకు కోమాలోనే ఉన్నాడని పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ రిపబ్లిక్ సినిమా వేడుకలో తెలియజేయడంతో అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే సాయి తేజ్ ఆరోగ్యంపై వస్తున్న వార్తల గురించి మెగాస్టార్ స్పందించారు.

Sai Dharam Tej : సాయి ధరమ్ కోలుకుంటున్నాడు.. మీ ఆశీస్సులు కావాలంటూ చిరు ట్వీట్..
Sai Dharam Tej

ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా సాయి ధరమ్ కోలుకుంటున్నాడు.. అతనికి మీ ఆశీస్సులు కావాలి.. రిపబ్లిక్ సినిమా విజయం రూపంలో అందించాలని ఆశిస్తున్నాను. రిపబ్లిక్ సినిమా చిత్ర బృందానికి నా కృతజ్ఞతలు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కుదేలైన సినీ ఎగ్జిబిషన్‌ సెక్టార్‌కు రిపబ్లిక్‌ చిత్ర విజయం కోలుకోవడానికి కావాల్సినంత  ధైర్యం ఇస్తుందని ఆశిస్తున్నాను.. అంటూ ట్వీట్ చేశారు.

ఈ క్రమంలోనే సాయితేజ్ ఆరోగ్య విషయంపై సంగీత దర్శకుడు ఎస్.ఎస్ తమన్ మాట్లాడుతూ.. త్వరలోనే నా స్నేహితుడిని కలవడం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అంటూ.. తమన్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే మెగాస్టార్, తమన్ ఇద్దరూ అతని ఆరోగ్యంపై స్పందించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now