Sai Dharam Tej : మెగా ఫ్యామిలీ అంతా ఒకే చోట.. యాక్సిడెంట్‌ తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ ఫస్ట్‌ టైమ్‌ ఫొటో..!

November 6, 2021 11:26 AM

Sai Dharam Tej : రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ సాయి ధ‌ర‌మ్ తేజ్ అపోలో ఆసుప‌త్రిలో 35 రోజుల పాటు చికిత్స పొందారు. వినాయ‌క‌చ‌వితి రోజు గాయ‌ప‌డ్డ ఆయ‌న విజ‌య‌ద‌శ‌మికి ఇంటికి వెళ్లారు. ఆ రోజు చిరంజీవి త‌న ట్వీట్‌లో ‘విజయ దశమి ప్రత్యేక రోజున సాయి ధరమ్‌ తేజ్‌ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. సాయి పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఇటీవల పెద్ద ప్రమాదం నుంచి బయట పడ్డ తేజ్‌కు ఇది పునర్జన్మ’ అంటూ రాసుకొచ్చారు. అనంతరం తేజ్‌కు ఆయన బర్త్‌డే విషెస్‌ తెలిపారు.

Sai Dharam Tej group pic with mega family

ఇక తాజాగా చిరు త‌న ట్వీట్‌లో.. అందరి ఆశీస్సులు, దీవెనలు ఫలించి సాయి ధరమ్ తేజ్ పూర్తి గా కోలుకున్నాడు. మా కుటుంబసభ్యులందరికీ ఇది నిజమైన పండుగ.. అని త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు చిరంజీవి. ఆయ‌న షేర్ చేసిన ఫొటోలో చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రామ్ చ‌ర‌ణ్‌, వ‌రుణ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్, అకీరా, బ‌న్నీ, నాగ‌బాబు అంద‌రూ ఉన్నారు. ఈ పిక్ మెగా అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది.

వినాయక చవితి రోజు బైక్‌పై వెళ్తున్న సాయి ధరమ్‌ తేజ్‌.. ప్రమాదవశాత్తూ జారిపడ్డారు. ఈ ప్రమాదంలో తేజ్‌ తీవ్రంగా గాయపడ్డారు. కాలర్‌ బోన్‌ విరగడంతో సర్జరీ చేశారు. ప్రమాదం తీవ్రత కారణంగా సాయిధరమ్‌ తేజ్‌ కోమాలోకి వెళ్లాడని స్వయంగా పవన్‌ కల్యాణే కామెంట్ చేశారు. కానీ ఆయ‌న ఇలా కోలుకొని మ‌ళ్లి ఇలా ఆనందంగా క‌నిపించ‌డం అభిమానుల‌కి ఆనందాన్ని క‌లిగిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now