RRR Movie : ఆర్ఆర్ఆర్‌పై భారీ ఆశ‌లు పెట్టుకున్న ఓటీటీ సంస్థ‌..!

November 5, 2021 7:43 PM

RRR Movie : ప్ర‌పంచ‌మంతా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుథిరం) సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలను పోషిస్తున్నారు. వీరికి జంటగా ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్, హిందీ నటి అలియా భట్ నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న  ఈ మూవీని విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

RRR Movie zee5 put big hopes on this movie

ఇక ఈ సినిమా నార్త్‌ ఇండియన్‌ థియేట్రికల్‌ రైట్స్‌తోపాటు శాటిలైట్‌ రైట్స్‌ ను బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ పెన్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ భారీ మొత్తానికి దక్కించుకుంది. పెన్ మూవీస్ కేవలం నార్త్ థియేట్రికల్ హక్కులను సొంత చేసుకోడమే కాకుండా మిగతా అన్ని భాషలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ సహా శాటిలైట్ హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఇక తెలుగు, తమిళం, క‌న్నడ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో డిజిట‌ల్ రైట్స్ ను జీ5 ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే.

జీ5 ఉత్త‌ర భార‌త‌దేశంలో మంచి ఆద‌ర‌ణ సంపాదించుకోగా, ద‌క్షిణ భార‌త‌దేశంలో ప‌ట్టుకోసం ప్ర‌య‌త్నిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇక్క‌డ కూడా స‌త్తా చాటాల‌ని భావిస్తోంది. ఆర్ఆర్ఆర్ పైనే భారీ ఆశ‌లు పెట్టుకున్న జీ5కి అంతా సానుకూలంగానే జ‌రుగుతుందా.. అనేది చూడాలి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదల కానుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment