RRR : అంద‌రికీ దిమ్మ తిరిగేలా షాకిచ్చిన రాజ‌మౌళి..!

October 3, 2021 9:08 AM

RRR : సంచ‌ల‌న చిత్రాల‌ను తెర‌కెక్కించే రాజ‌మౌళికి సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న పేరు అంతా ఇంతా కాదు. ఆయ‌న సినిమాల కోసం అటు బాలీవుడ్ కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటుంది. ఇక ప్ర‌స్తుతం ఆయ‌న తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం అభిమానులు క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీ రిలీజ్ విష‌యంలో రాజ‌మౌళి అంద‌రికీ దిమ్మ తిరిగేలా షాకిచ్చారు.

RRR : అంద‌రికీ దిమ్మ తిరిగేలా షాకిచ్చిన రాజ‌మౌళి..!

ఆర్ఆర్ఆర్ మూవీని మొద‌ట్లో ద‌స‌రాకే రిలీజ్ చేయాల‌నుకున్నారు. కానీ క‌రోనా కార‌ణంగా ప‌రిస్థితులు బాగాలేవు. తెలంగాణ‌లో 100 శాతం ఆక్యుపెన్సీకి థియేట‌ర్ల‌కు అనుమ‌తి ఉన్నా.. ఏపీ ప‌రిస్థితి వేరేగా ఉంది. ఇక పాన్ ఇండియా మూవీ క‌నుక‌.. ఇత‌ర భాష‌ల్లోనూ రిలీజ్ అవుతుంది క‌నుక‌.. ఆయా రాష్ట్రాల్లోని ప‌రిస్థితుల‌ను కూడా బేరీజు వేసుకోవాలి. అక్క‌డ కూడా పెద్ద‌గా ఏమీ పరిస్థితి బాగా లేదు. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ విడుద‌లను వాయిదా వేశారు.

అయితే అంద‌రికీ షాకిస్తూ రాజ‌మౌళి సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. ఆర్ఆర్ఆర్ మూవీని జ‌న‌వ‌రి 7న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. దీంతో ఆ స‌మ‌యానికి విడుద‌ల చేయాల‌ని ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన ఇత‌ర బ‌డా నిర్మాత‌లు ఒక్క‌సారిగా ఖంగు తిన్నారు. సంక్రాంతి బ‌రిలో ఇప్ప‌టికే స‌ర్కారు వారి పాట‌, భీమ్లా నాయ‌క్‌, రాధే శ్యామ్ చిత్రాలు ఉన్నాయి. వాటికి వారం ముందు ఆర్ఆర్ఆర్ ను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంటే ఆ చిత్రాలు విడుద‌ల అయ్యే స‌రికి థియేట‌ర్లన్నీ ఆర్ఆర్ఆర్ కే ఉంటాయి. వారికి ఉండ‌వు. ఇక క‌లెక్ష‌న్ల‌పై కూడా ప్ర‌భావం ప‌డుతుంది. దీంతో ఆయా సినీ నిర్మాత‌లు ఆందోళ‌న ఉన్న‌ట్లు తెలుస్తోంది.

అస‌లే కోవిడ్ కార‌ణంగా తీవ్ర‌మైన న‌ష్టాలో ఉన్న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు రాజ‌మౌళి తీసుకున్న నిర్ణ‌యం నిరాశ‌ను క‌లిగిస్తుంద‌ని చెప్ప‌వ‌చ్చు. అన్ని పెద్ద సినిమాలు ఒకేసారి అంటే క‌లెక్ష‌న్లు వ‌స్తాయా, రావా అని నిర్మాతలు ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే అప్ప‌టికి ఇంకా టైమ్ ఉంది క‌నుక ఎవ‌రైనా నిర్మాత‌లు వెన‌క్కి త‌గ్గుతారా ? లేక ఆర్ఆర్ఆర్ ను మ‌ళ్లీ వాయిదా వేస్తారా ? అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now