RRR Movie : రాజమౌళి దర్శకత్వంలో.. ఎన్‌టీఆర్, రామ్ చరణ్ తేజ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామని అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రమోషన్లతోపాటు పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. కానీ కోవిడ్ మూడో వేవ్ నేపథ్యంలో అనేక చోట్ల థియేటర్లపై ఆంక్షలు ఉండడం, కొన్ని చోట్ల పూర్తిగా మూసివేయడంతో.. ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు.
అయితే ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ సినిమా విడుదలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28వ తేదీ.. రెండింటిలో ఏదో ఒక తేదీన మూవీని విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే మార్చి 18వ తేదీన సినిమా విడుదల లేనట్లే అని తెలుస్తోంది. ఎందుకంటే ఆ రోజు కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటించిన తాజా చిత్రం జేమ్స్‌ను విడుదల చేయనున్నారు.
మార్చి 17వ తేదీన పునీత్ రాజ్ కుమార్ జయంతి ఉంది. అందువల్ల మార్చి 18న ఆయన సినిమా జేమ్స్‌ను రిలీజ్ చేయాలని మేకర్స్ చూస్తున్నారు. ఇక గతేడాది అక్టోబర్‌లో ఆయన గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మార్చి 18 నుంచి వారం పాటు కేవలం పునీత్ రాజ్ కుమార్ సినిమాలను మాత్రమే థియేటర్లలో ప్రదర్శించాలని కన్నడ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ల సంఘం నిర్ణయించింది. అందువల్ల ఆ వారం రోజుల పాటు కర్ణాటకలో ఇతర ఏ సినిమాలు ప్రదర్శితం కావు. ఆర్ఆర్ఆర్ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు. కనుక మార్చి 18వ తేదీన ఆర్ఆర్ఆర్ విడుదల కానట్లే అని స్పష్టమవుతుంది.
ఇక మిగిలి ఉన్న తేదీ ఏప్రిల్ 28. కనుక ఆ తేదీ రోజునే ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మార్చి అంటే అప్పటి వరకు కరోనా కేసులు కొంత వరకు తగ్గుముఖం పట్టినా.. థియేటర్లు పూర్తిగా ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. అదే ఏప్రిల్ 28 అయితే అప్పటి వరకు పరిస్థితుల్లో ఇంకా బాగా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆర్ఆర్ఆర్ మేకర్స్ ఏప్రిల్ 28వ తేదీనే ఆ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై చివరికి ఏం నిర్ణయిస్తారో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…