Bahubali 2 : బాహుబ‌లి 2 ద‌రిదాపుల్లోకి చేర‌ని ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2..!

April 27, 2022 7:59 PM

Bahubali 2 : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన పాన్ ఇండియా చిత్రం బాహుబ‌లి. ఈ సినిమాకి సీక్వెల్‌గా తెర‌కెక్కిన బాహుబ‌లి 2 చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. ఇంటా బ‌య‌టా ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేష‌న్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాహుబ‌లి 2 సినిమా ఎక్కువగా క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు అన్న పాయింట్‌తో అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఆ క్ర‌మంలోనే బాహుబ‌లి 2 ఉత్త‌రాదిలో రూ.510 కోట్లు వ‌సూలు చేసింది. ఈ సినిమా ద‌రిదాపుల్లో ఇటీవ‌ల విడుద‌లై సెన్సేష‌న్ క్రియేట్ చేసిన చిత్రాలు ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లేక‌పోవ‌డం విశేషం.

RRR and KGF 2 not even reach Bahubali 2
Bahubali 2

ఉత్త‌ర భార‌తదేశంలో కేజీఫ్ 2 రూ.250 కోట్లు, ఆర్ఆర్ఆర్ రూ.321 కోట్లు రాబ‌ట్టాయి. అదే భాహుబ‌లి2 విష‌యానికి వ‌స్తే రూ.510 కోట్ల వ‌సూళ్ళ‌ని రాబ‌ట్టింది. ఇక స్ట్రెయిట్ హిందీ చిత్రాల విష‌యానికి వ‌స్తే భ‌జరంగీ భాయిజాన్ రూ.320 కోట్లు, దంగల్ రూ.310 కోట్లు వ‌సూలు చేశాయి. ఈ లెక్క‌లు చూస్తుంటే బాహుబలి 2కి ఉత్తరాదిలో ఎలాంటి ఆదరణ లభించిందో కూడా ఇది చూపిస్తుంది. బాక్సాఫీస్ గణాంకాల విషయానికొస్తే, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్‌ ఇప్పటి వరకు రూ. 250 కోట్లు, రూ. 321 కోట్ల‌ను నికరంగా వసూలు చేశాయి. బాహుబలి 2 సంచలనాత్మకంగా రూ.510 కోట్లు నెట్‌ వసూలు చేసింది.

కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీఎఫ్ 2 చిత్రాన్ని కేజీఎఫ్ చిత్రానికి సీక్వెల్‌గా తీసుకొచ్చింది చిత్ర యూనిట్. అయితే కేజీఎఫ్ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ మాస్ ఆడియెన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మాస్ చిత్రాలను ఇష్టపడే నార్త్ ఆడియెన్స్‌కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే కేజీఎఫ్ 2 కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇక ఆర్ఆర్ఆర్ కూడా ప‌లు రికార్డుల‌ని చెరిపేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment