Rohit Sharma : రోహిత్ శ‌ర్మ ఫ్యాన్స్ ఆగ‌డం లేదుగా..! కొత్త శ‌కం మొద‌ల‌వుతుందా ?

November 16, 2021 9:36 PM

Rohit Sharma : బ్యాట్స్‌మ‌న్‌గా విరాట్ కోహ్లి ఎన్నో అద్భుతాలు చేయ‌గ‌ల‌డు. కోహ్లి గొప్ప బ్యాట్స్‌మన్. కానీ ఐసీసీ నిర్వ‌హించే మెగా టోర్నీల్లో గెలిచే స‌త్తా లేదు. ఇది ఎప్ప‌టి నుంచో వినిపిస్తున్న మాట‌. ఈ క్ర‌మంలోనే కోహ్లికి బ‌దులుగా రోహిత్ శ‌ర్మ‌కు కెప్ట‌న్సీ ప‌గ్గాలు ఇవ్వాల‌నే డిమాండ్ ఎప్ప‌టినుంచో వినిపిస్తోంది. అయితే అనూహ్యంగా టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ముందే కోహ్లి తాను ఆ టోర్నీ అనంత‌రం కెప్టెన్సీ నుంచి త‌ప్పుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు.

Rohit Sharma fans are unstoppable will he made indian cricket team proud

కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆ టోర్నీలో టీమిండియా చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేసింది. ఇక ఎలాగూ త‌ప్పుకుంటాన‌ని చెప్పాడు క‌నుక‌.. కోహ్లి కేవలం టీ20 ఫార్మాట్‌కు మాత్ర‌మే కెప్టెన్‌గా త‌ప్పుకున్నాడు. బ్యాట్స్‌మన్‌గా కొన‌సాగ‌నున్నాడు. మ‌రోవైపు త‌న‌కు ఎంతో ద‌గ్గ‌ర అయిన కోచ్ ర‌విశాస్త్రి ఆ ప‌ద‌వి నుంచి దిగిపోయారు. బ‌దులుగా ద్రావిడ్ వ‌చ్చాడు. ఇక టీ20 కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ ఎంపిక అయ్యాడు. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి.

బుధ‌వారం నుంచి భార‌త్.. న్యూజిలాండ్‌తో క‌లిసి స్వ‌దేశంలోనే టీ20 సిరీస్ ఆడ‌నుంది. దీంతో రోహిత్ కెప్టెన్‌గా ప్ర‌యాణం ఈ సిరీస్‌తోనే మొద‌ల‌వుతోంది. అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్‌కు ఎన్నో ట్రోఫీల‌ను అంద‌జేసిన ఘ‌న‌త రోహిత్ సొంతం. దీంతో భార‌త జ‌ట్టుకు కూడా అత‌ను అదే వైభ‌వం తెస్తాడ‌ని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే భార‌త టీ20 క్రికెట్‌లో కొత్త శకం ప్రారంభ‌మ‌వుతుంద‌ని కూడా ఫ్యాన్స్ అంటున్నారు.

కాగా సోష‌ల్ మీడియాలో #CaptainRohitEraBegins పేరిట పెద్ద ఎత్తున హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ కూడా చేస్తున్నారు. మ‌రి రోహిత్ శ‌ర్మ నిజంగానే మ్యాజిక్ చేస్తాడా ? టీ20 ల‌లో భార‌త్‌ను అగ్ర ప‌థాన నిలుపుతాడా ? అన్న‌ది చూడాలి. మ‌ళ్లీ టీ20 వ‌రల్డ్ క‌ప్ ఇప్ప‌ట్లో లేకున్నా.. ఇత‌ర దేశాల‌తో ఏవైనా సిరీస్ ఆడితే కెప్టెన్‌గా రోహిత్ స‌త్తా ఏమిటో తెలిసిపోతుంది. మ‌రి రోహిత్ కెప్టెన్‌గా ఎలా రాణిస్తాడ‌న్న‌ది.. ఆస‌క్తిక‌రంగా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment