RGV : రామ్ గోపాల్ వర్మ డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్. ఎవరికీ భయపడే వ్యక్తిత్వం కాదు ఆయనది. సినిమా పెద్దలకు, రాజకీయ నాయకులకు.. ఏ మాత్రం భయపడకుండా సినిమాలు తీస్తున్నాడు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి చంద్రబాబు పరువు దారుణంగా తీశాడు. ఇక పవన్ కళ్యాణ్‌ని కూడా పలు సందర్భాలలో విమర్శించాడు. తాజాగా తన కిడ్నాప్ కథాంశంతో ”ఆర్జీవీ మిస్సింగ్” అనే సినిమా రూపొందించారు రామ్ గోపాల్ వర్మ.
తాజాగా విడుదలైన ‘పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్’ ట్రైలర్ చూస్తే.. వర్మ లాక్ డౌన్ లో తీసిన ‘పవర్ స్టార్’ సినిమాకు ఆర్జీవీ మిస్సింగ్ కాన్సెప్ట్ ని జత చేసి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఒక్క సీటు కూడా రాలేదా’ అని బాధ పడుతున్న ఓ పొలిటికల్ లీడర్ ని చూపించడంతో ప్రారంభమైన ఈ టీజర్.. ఈ క్రమంలో ఫిల్మ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కిడ్నాప్ అవడం వల్ల జరిగిన పరిణామాలను చూపిస్తోంది.
రామ్ గోపాల్ వర్మ కిడ్నాప్ కు ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా మెగా ఫ్యామిలీ లేదా మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు అనుమానితులని చెబుతున్నారు. అయితే ఆర్‌జీవీ మిస్సింగ్ సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, రజనీ కాంత్, కేఏ పాల్, సీఎం కేటీఆర్ వంటి నిజ జీవిత పాత్రలను పోలిన వ్యక్తులు కనిపిస్తున్నారు.
రామ్ గోపాల్ వర్మ ఒక్కడే ఒరిజినల్ క్యారక్టర్ ప్లే చేశాడు. ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్‌ని ఎక్కువగా టార్గెట్ చేసినట్టు కనిపించాడు. అతని సినిమా, రాజకీయ విషయాలను టచ్ చేస్తూ మళ్లీ మెగా ఫ్యాన్స్‌ని గెలికాడు. ఇక చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ని కూడా కొంచెం బ్యాడ్ గానే చూపించాడు. మొత్తానికి వర్మ మరోసారి ఈ సినిమా ట్రైలర్‌తో వార్తలలో నిలిచాడని చెప్పవచ్చు. మరి పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..!
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…