RGV : వ‌ర్మ మ‌ళ్లీ గెలికాడు.. ప‌వ‌న్, చంద్ర‌బాబుల‌పై ఎందుకంత కక్ష‌..?

November 19, 2021 5:14 PM

RGV : రామ్ గోపాల్ వ‌ర్మ డేరింగ్ అండ్ డాషింగ్ ప‌ర్స‌న్‌. ఎవ‌రికీ భ‌య‌ప‌డే వ్య‌క్తిత్వం కాదు ఆయ‌న‌ది. సినిమా పెద్ద‌ల‌కు, రాజ‌కీయ నాయ‌కుల‌కు.. ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా సినిమాలు తీస్తున్నాడు. గ‌తంలో ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీసి చంద్ర‌బాబు ప‌రువు దారుణంగా తీశాడు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని కూడా ప‌లు సంద‌ర్భాల‌లో విమ‌ర్శించాడు. తాజాగా త‌న కిడ్నాప్ కథాంశంతో ”ఆర్జీవీ మిస్సింగ్” అనే సినిమా రూపొందించారు రామ్ గోపాల్ వర్మ.

RGV again targeted pawan and mega family and chandra babu naidu

తాజాగా విడుద‌లైన ‘పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్’ ట్రైలర్ చూస్తే.. వర్మ లాక్ డౌన్ లో తీసిన ‘పవర్ స్టార్’ సినిమాకు ఆర్జీవీ మిస్సింగ్ కాన్సెప్ట్ ని జత చేసి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ‘ఒక్క సీటు కూడా రాలేదా’ అని బాధ పడుతున్న ఓ పొలిటికల్ లీడర్ ని చూపించడంతో ప్రారంభమైన ఈ టీజర్.. ఈ క్రమంలో ఫిల్మ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కిడ్నాప్ అవడం వల్ల జరిగిన పరిణామాలను చూపిస్తోంది.

రామ్ గోపాల్ వర్మ కిడ్నాప్ కు ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా మెగా ఫ్యామిలీ లేదా మాజీ ముఖ్యమంత్రి, ఆయ‌న‌ కుమారుడు అనుమానితులని చెబుతున్నారు. అయితే ఆర్‌జీవీ మిస్సింగ్ సినిమాలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు, ర‌జ‌నీ కాంత్, కేఏ పాల్, సీఎం కేటీఆర్ వంటి నిజ జీవిత పాత్రలను పోలిన వ్యక్తులు కనిపిస్తున్నారు.

రామ్ గోపాల్ వర్మ ఒక్కడే ఒరిజినల్ క్యారక్టర్ ప్లే చేశాడు. ట్రైల‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ని ఎక్కువ‌గా టార్గెట్ చేసిన‌ట్టు క‌నిపించాడు. అత‌ని సినిమా, రాజ‌కీయ విష‌యాల‌ను ట‌చ్ చేస్తూ మ‌ళ్లీ మెగా ఫ్యాన్స్‌ని గెలికాడు. ఇక చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ని కూడా కొంచెం బ్యాడ్ గానే చూపించాడు. మొత్తానికి వ‌ర్మ మ‌రోసారి ఈ సినిమా ట్రైల‌ర్‌తో వార్త‌ల‌లో నిలిచాడ‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌రి ప‌వ‌న్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment