RGV fires on Garikapati : గరికపాటిపై ఆర్జీవీ సెటైర్లు..! నీకు పద్మశ్రీ అవసరమా అంటూ విమర్శల వర్షం..!

October 12, 2022 3:20 PM

RGV fires on Garikapati : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకోసం ఆయన ఏదో ఒక విషయాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే తాజాగా మరోసారి సంచలన ట్వీట్స్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు ఆర్జీవి. ఈసారి ఆయన గరికిపాటి నరసింహారావుపై  ట్విట్టర్ వేదికగా కొన్నికామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.

ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి, చిరంజీవిని మధ్య ఓ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. అభిమానులతో చిరంజీవి ఫోటోలు దిగుతున్న సమయంలో గరికపాటి ఫోటో సెషన్ ఆపేస్తే తాను మాట్లాడుతానని, లేదంటే వెళ్లిపోతానని ఆ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు నాగబాబుతో సహా మెగా అభిమానులు సైతం గరికిపాటిపై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.

RGV fires on Garikapati
RGV fires on Garikapati

ఈ క్రమంలోనే తాజాగా ఈ వివాదంపై వివాదాలకు కెరాఫ్‌ అడ్రెస్‌ అయిన రామ్‌ గోపాల్‌ వర్మ స్పందించి చిరంజీవి ఏనుగు.. నువ్వు గరిక.. నీకు పద్మ అవార్డు కూడా ఎక్కువే అంటూ గరికపాటిని ఉద్దేశించి ఘాటుగా విమర్శించాడు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆర్జీవీ నాగబాబు చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేసి ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు..

మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, తగ్గేదేలే. హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో అంటూ గరికపాటిని విమర్శించారు.

హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి . సర్ నాగబాబు గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు సర్  అని ప్రశ్నించాడు వర్మ. సర్ నాగబాబు గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి, దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కానీ అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు ఆర్జీవి ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు. ఆర్జీవీ గరికిపాటిపై చేసిన ట్విట్టర్ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now