Chandrababu Naidu : మొట్ట‌మొద‌టి సారిగా చంద్ర‌బాబు నాయుడు.. లైవ్‌లో ఏడ్చేశారు..!

Chandrababu Naidu : తెలుగు దేశం పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు త‌న 4 ద‌శాబ్దాల రాజ‌కీయ జీవితంలో తొలిసారిగా లైవ్‌లోనే ఏడ్చేశారు. ఆయ‌న అలా ఏడ‌వడం అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నుంచి ఆయ‌న వాకౌట్ చేసిన అనంత‌రం.. తిరిగి ఏపీకి సీఎం అయ్యాకే.. మ‌ళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతాన‌ని అన్నారు. వెంట‌నే ఆయ‌న మంగ‌ళ‌గిరిలో టీడీపీ ఆఫీస్‌కి చేరుకుని అక్క‌డ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. అందులో భాగంగానే ఆయ‌న లైవ్‌లోనే ఏడ్చేశారు.

కాగా ఇటీవ‌ల నిర్వ‌హించిన జ‌డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ఓట‌మి పాలైన విష‌యం విదిత‌మే. చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో టీడీపీ ఓట‌మి పాలైంది. దీంతో అసెంబ్లీలో త‌న‌ను అధికార పార్టీ వైసీపీ నేత‌లు, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అన‌రాని మాట‌లు అన్నార‌ని, తీవ్ర ప‌దజాలంతో దూషించార‌ని.. చివ‌ర‌కు త‌న భార్య భువ‌నేశ్వ‌రిని కూడా ఈ విష‌యంలోకి తీసుకొచ్చార‌ని.. చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అయితే ఆయ‌న ప్రెస్ మీట్ సంద‌ర్భంగా మాట్లాడుతూనే తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. ఒకానొక ద‌శ‌లో భావాల‌ను నియంత్రించుకోలేక‌పోయారు. లైవ్‌లోనే ఏడ్చేశారు. గతంలో ఆయ‌న ఎప్పుడు మీడియా స‌మావేశం పెట్టినా వైసీపీపై నిప్పులు చెరిగేవారు. అలాంటిది ఇప్పుడు ఆయ‌న ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని ఒక నిమిషం పాటు ఏడ్చారు. ఇక ఆయ‌న ప‌క్క‌న ఉన్న టీడీపీ నేత‌లు కూడా క‌న్నీళ్లు పెట్టుకున్నారు.

చంద్ర‌బాబు త‌రువాత త‌న దుఃఖాన్ని నియంత్రించుకుని మాట్లాడారు. త‌న భార్య ఎల్ల‌ప్పుడూ రాజ‌కీయాల్లో లేర‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ ఆమె త‌న ప్ర‌తి విజ‌యం వెనుక ఉన్నార‌ని తెలిపారు. వైసీపీ నేత‌లు త‌న‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించార‌ని.. తీవ్రంగా వేధింపుల‌కు గురి చేశార‌ని.. బాబు అన్నారు.

త‌న‌కు అధికారం అంటే ఆస‌క్తి లేద‌ని.. తాను ఇప్ప‌టికే ఎన్నో చూశాన‌ని.. రాష్ట్రానికి తాను రికార్డు స్థాయిలో సీఎంగా ఉన్నాన‌ని అన్నారు. త‌న‌కు రికార్డులు అవ‌స‌రం లేద‌న్నారు. రాష్ట్రంలో కొన‌సాగుతున్న నియంతృత్వ పాల‌న‌పై తాను పోరాటం చేస్తాన‌ని అన్నారు. ప్ర‌జ‌ల కోసం ముందుకు సాగుతాన‌ని అన్నారు. తాను రాజ‌కీయాల్లోకి మ‌ళ్లీ వ‌స్తాన‌ని తెలిపారు.

ఇక ప్రెస్ మీట్ చివ‌ర్లో కూడా చంద్ర‌బాబు మ‌ళ్లీ ఏడ్చారు. విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మాత్రం ఆయ‌న స‌మాధానాలు చెప్ప‌కుండానే వెళ్లిపోయారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM