bhimla nayak : రిపీట్ అవుతున్న కాంబినేషన్లు.. అప్పుడు ఎఫ్ 2.. ఇప్పుడు భీమ్లా నాయక్..!

October 2, 2021 9:43 AM

bhimla nayak : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి కీలక పాత్రలో భీమ్లా నాయక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా మలయాళంలో అయ్యప్పనుమ్ కోషియుమ్ గా తెరకెక్కి అద్భుతమైన విజయాన్ని అందించింది. ఇక తెలుగులో ఈ చిత్రంలో పవన్ భీమ్లా నాయక్ పాత్రలో నటించగా, రానా డానియల్ శేఖర్ గా రాబోతున్నారు. ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ విడుదల కాబోతుందని చిత్రబృందం ప్రకటించింది.

bhimla nayak : రిపీట్ అవుతున్న కాంబినేషన్లు.. అప్పుడు ఎఫ్ 2.. ఇప్పుడు భీమ్లా నాయక్..!

ఈ క్రమంలోనే గతంలో అదే జనవరి 12వ తేదీన దగ్గుబాటి కాంపౌండ్ నుంచి విక్టరీ వెంకటేష్, మెగా కాంపౌండ్ నుంచి వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఎఫ్ 2 విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇదే కాంబినేషన్ వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ రిపీట్ కానుంది. మెగా కాంపౌండ్ నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న భీమ్లానాయక్ విడుదల కానుంది.

మరి ఈ చిత్రం కూడా ఎఫ్2 లాగా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులని ఆకట్టుకొని విజయ పథంలో దూసుకుపోతుందేమో వేచి చూడాలి. ఇకపోతే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లు, పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని సినిమాపై అంచనాలను పెంచాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now